TS Eamcet 2022 నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 6 నుండి ధరఖాస్తుల స్వీకరణ

Published : Mar 28, 2022, 04:02 PM IST
TS Eamcet 2022 నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 6 నుండి ధరఖాస్తుల స్వీకరణ

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఉన్నత విద్యామండలి సోమవారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 6 నుండి మే 28వ తేదీ వరకు ధరఖాస్తులు స్వీకరించనున్నారు.

 హైదరాబాద్: తెలంగాణ Eamcet నోటిపికేషన్ ను ఉన్నత విద్యామండలి సోమవారం నాడు విడుదల చేసింది.  ఎంసెట్ తో పాటు E-cet ప్రవేశ పరీక్ష కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎంసెట్ ధరఖాస్తులను  ఈ ఏడాది ఏప్రిల్ 6 నుండి మే 28వ తేదీ వరకు స్వీకరించనున్నారు. 
 
ఈ ఏడాది జూలై 14, 15 జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ Agriculture ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. జూలై 18,19,20 తేదీల్లో ఎంసెట్ Engineering పరీక్షలు నిర్వహిస్తారు. .జూలై 13న ఈసెట్ Entrance నిర్వహించనున్నారు. ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను ఈ నెల 23వ తేదీన తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 28 రీజినల్ సెంటర్స్ పరిధిలోని 105 పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. 
జూలై 14,15, 18,19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.

IIT JEE  ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇటీవలనే విడుదలైంది. దీంతో ఇంటర్, Tenth పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసిన విషయం తెలిసిందే.  ఐఐటీ, జేఇఇ ప్రవశ పరీక్షల తర్వాతే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మే మాసంలో  ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలు పూర్తైన తర్వాత జూలైలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. Andhra Pradesh రాష్ట్రంలో కూడా జూలై మాసంలోనే ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కంటే ముందుగానే ఏపీలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా గత వారంలోనే షెడ్యూల్ ను విడుదల చేసింది. 

 ఎంసెట్ ప్రవేశ పరీక్షల కోసం ఈ నెల మొదటి వారంలో  తెలంగాణ ఉన్నత విద్యా మండలి సమావేశమైంది. ఎంసెట్ నిర్వహణపై చర్చించింది.  ఎంసెట్‌ పరీక్ష పూర్తయిన నెల రోజుల్లోపు ఎంసెట్‌ ర్యాంకలు వెల్లడి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  వాస్తవానికి గతంలో తెలంగాణ ఎంసెట్‌కు ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ ఉండేది. కానీ, ఈ దఫా  ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎంసెట్ కు ఉండదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షల్లో కనీస మార్కులతో విద్యార్ధులను  ప్రమోట్‌ చేశారు. ఈ మేరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్‌ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ  ఉన్నత విద్యామండలి  నిర్ణయం తీసుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu