ఈజీ మనీ కోసం ప్ర‌య‌త్నించి.. లక్షలు పోగొట్టుకున్నారు. యాదాద్రి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ‘యాప్’ల మోసం..

Published : Jan 03, 2022, 02:47 PM IST
ఈజీ మనీ కోసం ప్ర‌య‌త్నించి.. లక్షలు పోగొట్టుకున్నారు. యాదాద్రి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ‘యాప్’ల మోసం..

సారాంశం

సులభంగా డబ్బు సంపాదించవచ్చని యాప్ లలో డబ్బులు పెట్టుబడిగా పెట్టి లక్షలు మోసపోయారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వందలాది మంది యువత రూ.20 లక్షల వరకు మోసపోయారు. 

క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తే డ‌బ్బులు వ‌స్తాయి. అలా సంపాదించిన డ‌బ్బుల వ‌ల్ల ఎంతో సంతృప్తి ల‌భిస్తుంది. ఆ డ‌బ్బుల మీద గౌర‌వం పెరుగుతుంది. శ్ర‌మ విలువ తెలుస్తుంది. క‌ష్టం విలువు తెలుస్తుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఒక క్ర‌మశిక్ష‌ణమైన జీవ‌న విధానం ఏర్ప‌డుతుంది. కానీ క‌ష్ట‌ప‌డ‌కుండే డ‌బ్బులు వ‌స్తే.. దాని విలువ తెలియ‌దు. అలా వచ్చిన డ‌బ్బుపై గౌర‌వం ఉండ‌దు. ఈజీ మ‌నీ రావ‌డం వల్ల వ్య‌స‌నాలు పెరుగుతాయి.  అలా వ‌చ్చిన డ‌బ్బులు చేతిలో కూడా అస్స‌లు నిల‌వ‌వు. కానీ ఈజీ మ‌నీకి అల‌వాటు ప‌డిన వ్య‌క్తులు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డానికి బ‌ద్ద‌కిస్తారు. కొన్ని సార్లు ఆ ఈజీ మ‌నీ కోసం ప్ర‌య‌త్నించి, మ‌రిన్ని డ‌బ్బులు పోగొట్టుకుంటారు. యాదాద్రి జిల్లాలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. 

బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్.. కేసులకు భయపడొద్దని భరోసా..

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఓ ఘ‌రానా మోసం వెలుగులోకి వ‌చ్చింది. ఈ మోసం ఈజీ మ‌నీకి అల‌వాటు ప‌డిన వారినే టార్గెట్ చేసుకొని జ‌రిగింది. ఒకరు కాదు ఇద్ద‌రు కాదు వందల సంఖ్య‌లో యువ‌కులు ఈ మోసానికి బ‌ల‌య్యారు. ల‌క్ష‌ల రూపాయిలు పోగొట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా ఈ యాప్స్‌లో ప్ర‌తీ ఒక్క‌రూ డ‌బ్బులు పెట్టుబ‌డి గా పెట్టాలి. త‌రువాత రోజుకు కొన్ని డ‌బ్బుల‌ చొప్పున తిరిగి వ‌స్తుంటాయి. ఇలా పెట్టుబ‌డి పెట్టిన డ‌బ్బుల కంటే ఎక్కువ‌గానే తిరిగి వ‌స్తాయి. దీనికి అల‌వాటు ప‌డిన వారు మ‌ళ్లీ పెద్ద మొత్తంలో పెట్టుబ‌డి పెడ‌తారు. త‌రువాత కూడా వారికి డ‌బ్బులు తిరిగివ‌స్తాయి. ఇలా ఈజీగా డ‌బ్బులు వ‌స్తుండ‌టంతో ఇలాంటి యాప్‌లకు విప‌రీతంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఒకే సారి ఎక్కువ మంది జాయిన్ అయిన త‌రువాత కొన్ని రోజుల పాటు వారికి కూడా స‌క్ర‌మంగా డ‌బ్బులు అంద‌జేస్తారు. కానీ యాప్ నిర్వాహ‌కులు అనుకున్న టార్గెట్ మేర‌కు డ‌బ్బులు పెట్టుబ‌డిగా వ‌స్తే త‌రువాత ప‌త్తా లేకుండా పోతారు. యాదాద్రి భువ‌నగిరి జిల్లాలోని ప‌లు గ్రామాల్లో కూడా ఇలాగే జ‌రిగింది. 

బండి సంజయ్‌ బెయిల్ పిటిషన్ తిరస్కరణ: 14 రోజుల రిమాండ్ విధించిన కరీంనగర్ కోర్టు

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని రామ‌న్న‌పేట‌, జ‌నంప‌ల్లి, ల‌క్ష్మాపురంతో పాటు చుట్టుప‌క్క‌ల గ్రామాల్లోని యువ‌త ఈ యాప్ ల మోసం బారిన ప‌డ్డారు. ఈ యాప్ లలో రూ.2000 పెట్టుబ‌డి పెడితే రోజుకు 600 చొప్పున‌, 15,000 చెల్లిస్తే 2,900 వ‌స్తాయ‌ని చెప్పారు. దీంతో పెద్ద ఎత్తున య‌వ‌కులు పెట్టుబ‌డి పెట్టారు. కొన్ని రోజ‌లు ఈ యాప్ ల ద్వారా డ‌బ్బులు వ‌చ్చాయి. కానీ గ‌డిచిన మూడు రోజుల నుంచి డ‌బ్బులు రావ‌డం లేదు. నిర్వాహ‌కుల‌ను సంప్ర‌దించేందుకు ప్ర‌త్నించినా.. ఎలాంటి ఫ‌లితం లేదు. దీంతో మోస‌పోయామ‌ని గ్రహించారు. మొత్తంగా వంద‌లాది మంది యువ‌కులు ఈ యాప్స్ ల‌లో రూ.20 లక్ష‌ల వ‌ర‌కు యువ‌కులు మోస‌పోయార‌ని తెలుస్తోంది. ఇలా ఈజీ మ‌నీ కోసం ప్ర‌య‌త్నించి డ‌బ్బులు పోగొట్టుకోకూడ‌ద‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఉచితంగా ఎవ‌రూ డ‌బ్బులు ఇవ్వ‌ర‌ని సూచిస్తున్నారు. ఇక నుంచి అయినా యువ‌త, ప్ర‌జ‌లు ఇలాంటి విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలియ‌జేస్తున్నారు. నిజ‌మైన సంస్థ‌ల్లోనే పెట్టుబ‌డులు పెట్టాల‌ని సూచిస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం