బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు: కౌంటరిచ్చిన కేటీఆర్

Published : Feb 16, 2022, 09:31 AM ISTUpdated : Feb 16, 2022, 09:39 AM IST
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  వివాదాస్పద వ్యాఖ్యలు: కౌంటరిచ్చిన కేటీఆర్

సారాంశం

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. 

హైదరాబాద్: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో BJPఎమ్మెల్యే Raja Singh చేసిన వ్యాఖ్యలకు TRS వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి KTR  కౌంటరిచ్చారు.ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలంటే  యోగి ఆదిత్యనాధ్ ను గెలిపించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.

 

 ఒకవేళ బీజేపీకి లేదా యోగి ఆదిత్యనాథ్ కు మద్దతు ఇవ్వకపోతే Uttar Pradesh ను వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుందని రాజాసింగ్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం నాడు రాజాసింగ్ ఓ వీడియోను Social Media లో పోస్టు చేశారు. బుల్‌డోజర్లు ఎందుకు వస్తాయో మీకు తెలుసు కదా అంటూ రాజా సింగ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.రాజాసింగ్ వ్యాఖ్యలకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా బుధవారం నాడు కౌంటరిచ్చారు. యూపీకి ఓటెయని వారిని గుర్తించి గట్టిగా బుద్ది చెబుతామని ఆ వీడియోలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. బీజేపీలో మరో అద్భుత  హాస్యనటుడు కన్పించారని కేటీఆర్ సెటైర్లు వేశారు. బీజేపీకి ఓటేయకపోతే  యోగి మీ ఇంటిని బుల్డోజర్లను కూల్చివేస్తాడని తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఇటీవల కాలంలో మాటల యుద్దం కొనసాగుతుంది. రెండు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకొంటున్నారు.  చర్చలకు సిద్దమంటూ సవాళ్లు చేసుకొంటున్నారు. కేంద్రంపై అమీతుమీకి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కోసం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇతర ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకొని  బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కోసం టీఆర్ఎస్ చీఫ్ కొంత కాలంగా సన్నాహలు చేస్తున్నారు. ఈ మేరకు పలు రాష్ట్రాల్లోని బీజేపీయేతర సీఎంలతో కేసీఆర్ మంతనాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.

బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు విషయమై కేసీఆర్ కు దేవేగౌడ మద్దతు ప్రకటించారు. ఈ విసయమై దేవేగౌడ కేసీఆర్ తో మంగళవారం నాడు ఫోన్ లో మాట్లాడారు. బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను వేగవంతం చేయాలని కూడా దేవేగౌడ కోరారు.  మతతత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని ఆయన చెప్పారు. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమంద‌రం మీకు అండగా వుంటాం… మీ యుద్దాన్ని కొనసాగించాలని కేసీఆర్‌కు దేవేగౌడ సూచించారు. దీనికి ముఖ్యమంత్రి బదులిస్తూ తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమ‌వుతాన‌ని చెప్పారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ బిజెపిపై స్వరం పెంచిన సంగతి తెలిసిందే. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మరో 22 నెలల గడువు ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్