అదరకొట్టేసావ్ బావా.. హరీశ్ కి కేటీఆర్ ప్రశంస

Published : Feb 07, 2019, 02:42 PM IST
అదరకొట్టేసావ్ బావా.. హరీశ్ కి కేటీఆర్ ప్రశంస

సారాంశం

తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  హరీశ్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. అదరగొట్టేసావ్ బావా అంటూ ట్విట్టర్ వేదికగా మెచ్చుకున్నారు.

తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  హరీశ్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. అదరగొట్టేసావ్ బావా అంటూ ట్విట్టర్ వేదికగా మెచ్చుకున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... హరీశ్ రావు సిద్ధిపేటలో సమీకృత మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఆ మార్కెట్ కి సంబంధించిన ఫోటోలను హరీశ్... తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. సీఎం కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆ మార్కెట్ ని నిర్మించారు. ఒకేచోట కూరగాయలు, మాంసాన్ని విక్రయించేందుకు భారీ మార్కెట్ ను అత్యాధునికంగా నిర్మించారు.

దాదాపు రూ.20కోట్లు ఖర్చు చేసి దీనిని నిర్మించారు. కాగా... ఈ ఫోటోలను ట్విట్టర్ లో చూసిన కేటీఆర్ దానికి స్పందించారు. చూడటానికి చాలా అద్భుతంగా ఉందని.. నీకివే నా అభినందనలు బావా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో హరీశ్ తో కేటీఆర్ కి మధ్య సంబంధం ఎప్పటిలాగానే ఉందని చెప్పకనే చెబుతోంది.

కేటీఆర్ తోపాటు.. నెటిజన్లు కూడా హరీశ్ ట్వీట్ పై స్పందిస్తున్నారు. చాలా బాగుందని.. మంచి ఆలోచన అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !