సంక్రాంతి తర్వాతే ఆ కార్యక్రమం: కార్యదర్శుల సమావేశంలో కేటీఆర్

By Arun Kumar PFirst Published Dec 28, 2018, 7:43 PM IST
Highlights

నూతన ఓటర్ల చేరిక, ప్రస్తుత ఓటర్ల జాబితా సవరణ పైన చురుగ్గా పని చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు నాయకులకు టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కేటీఆర్ ఓటర్ల జాబితా సవరణ, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుపైన చర్చించారు. 

నూతన ఓటర్ల చేరిక, ప్రస్తుత ఓటర్ల జాబితా సవరణ పైన చురుగ్గా పని చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు నాయకులకు టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కేటీఆర్ ఓటర్ల జాబితా సవరణ, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుపైన చర్చించారు. 

ఎలక్షన్ కమిషన్ మరో నెల రోజుల పాటు కొత్త ఓటర్లు, జాబితాలో మిస్సయిన ఓటర్ల నమోదుకు అవకాశాన్ని కల్పించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.ఈ నేపథ్యంలో ప్రతి గ్రామం కేంద్రంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీ శ్రేణులను ముందుకు తీసుకు పోవాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలతో సమన్వయం చేసుకొని ఓటు హక్కు నమోదు చేయించేందుకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని ఓటర్లను జాబితాలో  చేర్చాలన్నారు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారన్నారు.  

ఈ నెల రోజులపాటు సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటర్ల జాబితాలో చేర్చాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలతోపాటు మండల స్థాయి పార్టీ అధ్యక్షులు తోనూ పార్టీ కార్యదర్శులు నేరుగా మాట్లాడుతూ.. ఈ మొత్తం ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ ఆదేశించారు.  ప్రధాన కార్యదర్శులు ఈ నెల రోజులపాటు సాధ్యమైనంత ఎక్కువ రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలన్నారు.  

నూతన ఓటర్ల నమోదు మరియు సవరణ ప్రక్రియను  పర్యవేక్షించేందుకు తెలంగాణ భవన్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండు రోజులకోసారి  ఎంతమంది ఓటర్లను నమోదు చేయించేందుకు దరఖాస్తులు సమర్పించారో వాటి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. దీంతోపాటు ప్రతిరోజు ఎంత మంది దరఖాస్తులను నమోదయ్యేలా చేశారు వాటి గణాంకాలను కూడా పంపాలన్నారు. పార్టీ కార్యాలయ కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తారని కేటీఆర్ తెలిపారు. 

పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పచెప్పిన మరో కీలకమైన అంశం జిల్లా పార్టీ కార్యాలయాలకు భవనాల నిర్మాణం సంబంధించిన ప్రక్రియపైన కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం అనుమతించిన మేరకు ప్రతి జిల్లా కార్యాలయానికి ఒక ఎకరం మేరకు స్థలాన్ని సేకరించేందుకు అవకాశం ఉందని, ఇప్పటికే దాదాపు 20 జిల్లా కేంద్రాల్లో స్థలాల ఎంపిక పూర్తయిందని కేటీఆర్ తెలిపారు.

ఈ స్థలాలను ఖరారు చేసేందుకు పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు స్వయంగా వెళ్లి పరిశీలించాలన్నారు. సంక్రాంతి తర్వాత వరుసగా జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయని ఈ సందర్భంగా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.   

click me!