మంత్రి పదవి ఇచ్చినా టీఆర్ఎస్‌లో చేరను: మచ్చా నాగేశ్వర్ రావు

By narsimha lodeFirst Published Dec 28, 2018, 7:34 PM IST
Highlights

టీఆర్ఎస్ లో చేరాలని తనకు ఆ పార్టీ ముఖ్య నేత నుండి ఆఫర్ వచ్చిందని ఆశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావు చెప్పారు. 

ఖమ్మం: టీఆర్ఎస్ లో చేరాలని తనకు ఆ పార్టీ ముఖ్య నేత నుండి ఆఫర్ వచ్చిందని ఆశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావు చెప్పారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా కూడ టీడీపీని వీడబోనని ఆయన తేల్చి చెప్పారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఆశ్వరావుపేట అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ ఇద్దరు నేతలకు టీఆర్ఎస్ గాలం వేసింది. సత్తుపల్లి నుండి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మంత్రి పదవిని ఆఫర్ ఇచ్చిందనే ప్రచారం కూడ ఉంది.

ఆశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావును కూడ తీసుకురావాలని  సండ్రకు బాధ్యతలు అప్పగించారని సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ ఇద్దరు కూడ టీఆర్ఎస్ లో చేరడం నిలిచిపోయింది.

అయితే టీఆర్ఎస్ లో చేరే విషయమై మచ్చా నాగేశ్వర్ రావు ఇవాళ మీడియాతో మాట్లాడారు.తనకు టీడీపీని వీడే ఆలోచన తనకు లేదన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినా టీడీపీని వీడబోనని చెప్పారు.

ఆశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించారని నాగేశ్వర్ రావు చెప్పారు. అధికార పార్టీలో చేరకపోతే నిధులు రావనే వాదనలు సరికాదన్నారు. విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు కూడ కేసీఆర్ నిధులు ఇస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

సండ్ర, మచ్చాలకు టీఆర్ఎస్ గాలం: పార్టీ మార్పుపై తేల్చేసిన ఎమ్మెల్యేలు

 

click me!