ఎఫ్‌ఆర్‌వోపై దాడి: చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న కేటీఆర్

By Siva KodatiFirst Published Jun 30, 2019, 5:48 PM IST
Highlights

కొమరంభీం జిల్లాలో మహిళా ఫారెస్ట్ అధికారిపై టీఆర్ఎస్ నేత కోనేరు కృష్ణ దాడి చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు.

కొమరంభీం జిల్లాలో మహిళా ఫారెస్ట్ అధికారిపై టీఆర్ఎస్ నేత కోనేరు కృష్ణ దాడి చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో భేటీ అయిన ఆయన... విధి నిర్వహణలో ఉన్న ఎఫ్ఆర్‌వోపై కోనేరు దాడి చేయడం హేయమన్నారు.

ఈ ఘటనలో కోనేరు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారని.. చట్టానికి ఎవరు అతీతులు కాదని కేటీఆర్ తెలిపారు. ఇదే సమావేశంలో జూలై 20కి ముందే సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన ఇన్‌ఛార్జ్‌లకు సూచించారు.

119 నియోజకవర్గాలకు 60 లక్షల సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాల వారీగా పార్టీ సభ్యుల సమాచారం డిజిటలైజేషన్ చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. అదే విధంగా పార్టీ అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేయాలని... ఆయా కమిటీల్లో 51 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సభ్యత్వం కల్పించాలని కేటీఆర్ సూచించారు. 

click me!