కవిత ఓటమిపై కేటీఆర్ వ్యాఖ్యలు

Published : May 28, 2019, 03:14 PM IST
కవిత ఓటమిపై కేటీఆర్ వ్యాఖ్యలు

సారాంశం

ఈ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ లాంటివని ఆయన స్పష్టం చేశారు. తన సోదరి కవిత ఓటమిపై కేసీఆర్ స్పందించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు ఒక్కటయ్యాయని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ లో నామినేషన్ వేసింది రైతులు కాదని నేతలేనని స్పష్టం చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ లోక్ సభ ఎన్నికల తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండింగ్ కనిపించిందని అభిప్రాయపడ్డారు. 

మల్కాజ్ గిరిలో వెంట్రెకవాసితో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. ఆదిలాబాద్ లో బీజేపీ గెలుస్తోందని ఆ పార్టీ కూడా ఊహించలేదు. మోదీ హవాతోనే బీజేపీకి ఓట్లు పడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. సీట్లు పోయినా టీఆర్ఎస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగిందన్నారు. 

ఈ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ లాంటివని ఆయన స్పష్టం చేశారు. తన సోదరి కవిత ఓటమిపై కేసీఆర్ స్పందించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు ఒక్కటయ్యాయని చెప్పుకొచ్చారు. 

నిజామాబాద్ లో నామినేషన్ వేసింది రైతులు కాదని నేతలేనని స్పష్టం చేశారు. కవిత డాటర్ ఆఫ్ ఫైటర్ అని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. నిరంతరం కవిత ప్రజల మధ్యనే ఉంటుందని తెలిపారు. 

దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించేది ప్రాంతీయ పార్టీలేనని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను ఫెయిల్ కాలేదన్నారు.  

PREV
click me!

Recommended Stories

Government Jobs : గట్టిగా ట్రై చేస్తే నెలకు రూ.1,27,050 జీతంతో ఓ సర్కార్ నౌకరీ మీదే.. టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డిటెయిల్స్
Flash Floods Alert : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా?