ఎమ్మార్వో కార్యాలయం ఎదుటే మహిళా రైతు ఆత్మహత్యాయత్నం...(వీడియో)

By Arun Kumar PFirst Published May 28, 2019, 2:53 PM IST
Highlights

తన భూమికి సంబంధించిన పట్టాపాస్ బుక్ కోసం ఓ మహిళా రైతు ఏకంగా రెవెన్యూ  కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గతకొంతకాలంగా కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా తన భూమి పత్రాలను అందించడం లేదంటూ బాధిత మహిళ ఆరోపించారు. తమ కుటుంబానికి జీవనాధారమైన ఆ భూమి కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని...అది చూసేకన్నా చనిపోవడమే మేలని భావించి బలవన్మరణానికి పాల్పడినట్లు మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ  సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలకేంద్రంలో చోటుచేసుకుంది. చౌలపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. కుటుంబానికి చెందిన 12  ఎకరాల భూమిని సాగుచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యప్తంగా భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి రైతులకు కొత్త పట్టాదార్ పాస్ బుక్ లు అందించిన విషయం తెలిసిందే. కానీ వివాదాస్పద భూములకు కలిగివున్న రైతులకు మాత్రం పాస్ బుక్ లు అందించలేదు.  ఇలా బాధిత రైతుకు కూడా పాస్ బుక్ అందలేదు. 

అయితే తన భూమి ఎలాంటి వివాదాల్లో లేదంటూ సదరు మహిళ మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. తనకు న్యాయం చేసి భూమికి సంబంధించిన పట్టా పాస్ బుక్  ఇవ్వాల్సిందిగా అధికారులకు వినతిపత్రం సమర్పించుకుంది. ఇలా ఏడాదికాలంగా అధికారుల చుట్టూ తిరిగుతున్నా న్యాయం జరక్కపోవడంతో ఆమె ఆందోళనకు గురయ్యింది. ఆ భూమి తనకు దక్కదేమోనన్న బాధతో దారుణ  నిర్ణయం తీసుకుంది. 

ఇలా సోమవారం మరోసారి కేశంపేట తహసీల్దార్ కార్యాలయానికి ఓ తాడును వెంటబెట్టుకుని వచ్చిన ఆమె అక్కడేవున్న ఓ చెట్టుకు ఉరేసుకోడానికి ప్రయత్నించింది. అక్కడున్నవారు గమనించి ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని బాధితురాలిని సముదాయించి అక్కడినుండి తీసుకెళ్లారు.  

అయితే కార్యాలయ ప్రాంగణంలో ఇంత జరుగుతున్నా రెవెన్యూ సిబ్బందిలో మాత్రం ఎలాంటి స్పందన కన్పించలేదు. మహిళకు సంబంధించిన వివరాలు, సమస్య గురించి చెప్పడానికి కూడా వారు తిరస్కరించారు. ఈ ఘటన తర్వాత కూడా సదరు బాధితురాలిపై కనీసం జాలి కూడా చూపించకుండా దారుణంగా వ్యవహరించారు.  

వీడియో

"

click me!