అలాంటి సీఎం దేశంలో ఎక్కడా లేరు.. కేటీఆర్

Published : Apr 05, 2019, 01:28 PM IST
అలాంటి సీఎం దేశంలో ఎక్కడా లేరు.. కేటీఆర్

సారాంశం

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో రూపాయి పెట్టుబడి పెడితే అంతకు రెట్టింపు రాబడి వస్తుందన్నారు

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో రూపాయి పెట్టుబడి పెడితే అంతకు రెట్టింపు రాబడి వస్తుందన్నారు.  శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన తెలంగాణ బిల్డర్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. 

సీఎం కేసీఆర్‌లా ఒక రైతుకు ఫోన్‌ చేసి అరగంట మాట్లాడిన సీఎం దేశంలో ఎవరూ లేరని చెప్పారు. బిల్డర్స్‌కు స్వీయ నియంత్రణ కూడా ఉండాలని కేటీఆర్ సూచించారు. 

నిర్మాణ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. నిర్మాణరంగంలోని సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ సిటీని నిర్మించడం తేలిక అని చెప్పారు. రాత్రికి రాత్రి సమస్యలు పరిష్కారం కావని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?