తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు కేటీఆర్ అభినందనలు

By Arun Kumar PFirst Published Feb 25, 2019, 8:58 PM IST
Highlights

బల్గేరియాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలో గోల్డ్ మెడల్ తో అదరగొట్టిన బాక్సర్ నిఖత్ జరీన్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. తెలంగాణ కు చెందిన ఓ మహిళా క్రీడాకారిణి ఇలా బాక్సింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో రాణించడం రాష్ట్రానికే గర్వకారణమని ఆయన ప్రశంసించారు.

బాక్సర్ నిఖత్ జరీన్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె తనకు లభించిన బంగారు పతకాన్ని వారికి చూపించింది. జరీన్ పోరాట స్ఫూర్తి, పట్టుదలను అభినందించిన కేటీఆర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.  

కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారంతో జరీన్ బాక్సింగ్ కెరీర్ ను ఎంచుకుని రాణిస్తున్నట్లు తెలుసుకున్న కేటీఆర్ వారిని కూడా అభినందించారు. అద్బుతమైన ప్రదర్శనతో బాక్సింగ్ లో రాణిస్తున్న జరీన్ తెలంగాణ యువతకు ఒక ఐకాన్ గా నిలుస్తుందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఆమెకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా జరీన్ మాట్లాడుతూ...గతకొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం తనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తానని జరీన్ ధీమా వ్యక్తం చేశారు. తన ప్రతిభను గుర్తించి తగిన విధంగా సహాయాన్ని అందించినందుకు ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  

click me!