
తెలంగాణలో ‘కారు’కు తిరుగేలేదనుకుంటున్న వేళ రంగారెడ్డి జిల్లా తాండూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక షాక్ ఇచ్చింది.
ఇది మరవకముందే టీఆర్ఎస్ కు సొంతపార్టీ నుంచే మరో షాక్ తగిలింది. మహిళాదినోత్సవానికి ఒక రోజు ముందే ఓ మహిళా ఎంపీటీసీ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పింది.
కరీంనగర్ జిల్లా రేణికుంట ఎంపీటీసీ సభ్యురాలు బోయిని రేణుక మంగళవారం తన పదవికి, టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మంగళవారం జరిగిన మండల సమావేశంలో తమకు పార్టీ నేతలు అన్యాయం చేశారని, ఆ బాధతోనే తాను రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించారు.
టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వంతోపాటు, ఎంపీటీసీ పదవికి చేసిన రాజీనామా లేఖను శాసనసభ్యుడు రసమయి బాలకిషన్‌కు అందజేశారు. మండల సమావేశం మధ్యలో కూర్చుని తన నిరసన తెలిపి అనంతరం బయటకు వెళ్ళిపోయారు.
మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక, ఎంపీటీసీ రాజీనామా ఓ అధికార పార్టీకి చాలా చిన్న విషయాలే కావొచ్చు. కానీ, అధికార పార్టీ ఇలాంటి చిన్నవిషాయాలలో పరాభవం పొందడం మాత్రం చాలా పెద్ద విషయమే.