ఆ పథకంతో పేదోళ్లకు ఒరిగిందేమీ లేదు..నేనూ కేసీఆర్ మనిషినే.. మహిళా సర్పంచ్ ఫైర్..

By AN TeluguFirst Published Jul 6, 2021, 4:59 PM IST
Highlights

హరితహారంలో మొక్కలు పెంపకంపై సర్పంచ్ కు షోకాజ్ నోటీసు, సస్పెండ్ చేస్తాననడం ఏంటి? సర్పంచ్ అంటే యంత్రమా? కాంట్రాక్టరా? ప్రజలెన్నుకున్న మనిషి. ప్రజల బాగోగులు చూసుకునే అధికారం కల్పించారు. కాకపోతే కేసీఆర్ గారు ఇలా అనడం బాలేదు అంటూ విరుచుకుపడింది ఓ అధికార పార్టీ మహిళా సర్పంచ్.

హరితహారంలో మొక్కలు పెంపకంపై సర్పంచ్ కు షోకాజ్ నోటీసు, సస్పెండ్ చేస్తాననడం ఏంటి? సర్పంచ్ అంటే యంత్రమా? కాంట్రాక్టరా? ప్రజలెన్నుకున్న మనిషి. ప్రజల బాగోగులు చూసుకునే అధికారం కల్పించారు. కాకపోతే కేసీఆర్ గారు ఇలా అనడం బాలేదు అంటూ విరుచుకుపడింది ఓ అధికార పార్టీ మహిళా సర్పంచ్.

ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగింది. ఆ సర్పంచ్ మండె నాగరాజేశ్వరి. టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్. రైతుబంధు పథకం మీద ఆమె విమర్శలు గుప్పించారు. ఇంకా మాట్లాడితే నేనూ కేసీఆర్ మనిషినే.. అయితే మాత్రం అన్యాయం మీద మాట్లాడొద్దా అంటూ దుమ్ము దులిపారు. 

డబుల్ బెడ్రూమ్స్ అంటున్నారు. కొంతమందికి ఇవ్వలేకపోతున్నాం. అలాంటి వాళ్లకు స్థలాలు ఇస్తే శాయశక్తుల కష్టపడి కట్టుకునే ప్రయత్నం చేస్తారు. లబ్దిదారులకు పెన్షన్లు త్వరగా వచ్చేలా చేయాలి అన్నారు. రైతు బంధు అంటున్నారు. రైతు బంధు అంటే రైతుకు బంధు, పది ఎకరాలు ఉన్నవారికి యాభై వేలు, లక్ష రూపాయలు ఇస్తున్నారు. 

ఆ పథకంతోని ఉన్నోళ్లకే తప్ప, పేదోళ్లకు ఒరిగిందేమీ లేదు. నేనూ అధికార పార్టీలోనే ఉన్నా. ప్రజల కోసం కేసీఆర్ గారిని ప్రశ్నించాల్సి వస్తోంది. వారికోసం ఏం చేస్తున్నామన్న దానిమీద మాట్లాడాల్సి వస్తోంది. అంటూ తొణుకుబెణుకు లేకుండా నాగరాజేశ్వరి మాట్లాడారు. 

మండె నాగరాజేశ్వరి  భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని సుజాత నగర్ మండలానికి చెందిన నాయకుల గూడెం సర్పంచ్. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె వేదికమీద మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎదుట తన నిరసన గళం వినిపించారు. ప్రభుత్వ పథకాల్లోని లోపాలను ఎండగట్టారు. సర్పంచ్ రాజేశ్వరి విమర్శలతో ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ నేతలు, అధికారులు కూడా షాక్ అయ్యారు. 
 

click me!