ఉగ్రవాదులతో లింక్స్‌: బోధన్ లో ఒకరి అరెస్ట్

Published : Jul 06, 2021, 04:37 PM ISTUpdated : Jul 06, 2021, 04:39 PM IST
ఉగ్రవాదులతో లింక్స్‌: బోధన్ లో  ఒకరి అరెస్ట్

సారాంశం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో  ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఓ వ్యక్తిని  కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులు మంగళవారంనాడు అదుపులోకి తీసుకొన్నారు.

బోధన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో  ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఓ వ్యక్తిని  కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులు మంగళవారంనాడు అదుపులోకి తీసుకొన్నారు.సౌదీలో ఉన్న సమయంలో ఆ వ్యక్తి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే కారణంగా అరెస్టయ్యారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యాడు.  సౌదీలో ఉన్న సమయంలో  పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అరెస్టయ్యాడు. 

బెయిల్ పై విడుదలైన తర్వాత అతను పరారీలో ఉన్నాడు. ఇండియాకు వచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే హైద్రాబాద్ లో  ఇమ్రాన్, నాసిర్ అనే ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.

బీహార్ రాష్ట్రంలోని దర్భాంగా పేలుడుకు ఈ ఇద్దరు కుట్ర పన్నారని పోలీసులు తేల్చారు.దర్బాంగా పేలుడు ఘటనపై  హైద్రాబాద్ కేంద్రంగా ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ పేలుడుకు సంబంధించి ఉపయోగించిన రసాయనాల కొనుగోలు తదితర అంశాల గురించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.. ఈ కేసుకు సంబంధించి .సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే