టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే...

First Published Mar 26, 2018, 10:30 AM IST
Highlights

హోం మంత్రి నాయిని, మున్సిపల్ మంత్రి కేటీఆర్, పార్టీ కార్యదర్శి మాదాటి రమేష్ రెడ్డిలు ఎమ్మెల్సీ ఎన్నికల సమనర్వయకర్తలుగా వ్యవహరిస్తారు.

ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రటించారు.

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావులను ఎంపిక చేయగా... గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా డి. రాజేశ్వర్, ఫారూక్ హుస్సేన్ పేర్లను  ఖరారు చేశారు.

 

స్థానిక సంస్థల కోటా కింద ఎంఐఎం పార్టీకి చెందిన సయ్యద్ అమీనుల్ అసద్ జాఫ్రీకి టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది. కాగా, ఉపధ్యాయ ఎమ్మెల్సీ కోటా నుంచి జరిగే ఎన్నికకు కాటేపల్లి జనార్థన్ రెడ్డిని  పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా ప్రకటించింది.

 

మైనంపల్లి గతంలో టీడీపీలో ఉండి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

 

కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సుభాష్ రెడ్డి పేరును కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం పరిశీలించినా సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇవ్వడం కుదరలేదుని తెలిసింది.

 

మళ్లీ ఎమ్మెల్సీ ఖాళీలు ఏర్పడినప్పుడు సుభాష్ రెడ్డిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం భావిస్తున్నారట.

 

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 7 ఎమ్మెల్సీ స్థానాలకు ముస్లిం సామాజిక వర్గం నుంచి ఇద్దరు, రెడ్డి సమాజిక వర్గం నుంచి ఇద్దరు, ఒకరు క్రిస్టియన్లు, బీసీలకు ఒకటి, వెలమ సామాజిక

వర్గం నుంచి ఒకరికి అభ్యర్థిత్వం దక్కాయి.

 

హోం మంత్రి నాయిని, మున్సిపల్ మంత్రి కేటీఆర్, పార్టీ కార్యదర్శి మాదాటి రమేష్ రెడ్డిలు ఎమ్మెల్సీ ఎన్నికల సమనర్వయకర్తలుగా వ్యవహరిస్తారు.

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

click me!