ఈ నెల 5 మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీ: 283 మందితో తీర్మానం చేయనున్న టీఆర్ఎస్

By narsimha lode  |  First Published Oct 2, 2022, 5:34 PM IST

ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 1:19 గంటలకు  జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించనున్నారు. 283 మంది పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు,నేతలు సమావేశానికి హజరు కానున్నారు. 


హైదరాబాద్: జాతీయ పార్టీ ఏర్పాటుపై ఈ నెల 5వ తేదీన 283 మందితో తీర్మానం చేయనుంది టీఆర్ఎస్.  పార్టీకి  చెందిన ప్రజా ప్రతినిధులు,నేతలు  283మంది  సమావేశానికి హాజరుకానున్నారు. అక్టోబర్ 5వ తేదీన ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు  తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:19 గంటలకు కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్నారు. 

ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు, గ్రంథాలయ సంస్థల చైర్మెన్లు, డీసీసీబీ చైర్మెన్లు, డీసీఎంఎస్ చైర్మెన్లు, జిల్లా పరిషత్ చైర్మెన్లు సహ ప్రజా ప్రతినిధులతో పాటు నేతలు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానం చేసిన తర్వాత అదే రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. అంతేకాదు ఈ సమావేశం రోజున కొందరు జాతీయ స్థాయి నేతలు కూడా రానున్నారని సమాచారం..  పలు రాష్ట్రాల్లో పనిచేస్తున్న కొన్ని సంస్థలు కూడా టీఆర్ఎస్ లో విలీనమయ్యే అంశాలపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. 

Latest Videos

undefined

టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరును మార్చనున్నారు.  దీంతో పార్టీ ఎన్నికల గుర్తు కారు కొనసాగనుంది. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండకుండా పార్టీ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. టీఆర్ఎస్ కేవలం తెలంగాణకు సంబంధించిందే. దీంతో టీఆర్ఎస్ పేరును మార్చనున్నారు. 

జాతీయ పార్టీకి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టేందుకు కేసీఆర్ మొగ్గు చూపినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారత రాష్ట్ర సమితి కాకపోతే  నయా భారత్  అనే పేరు కూడా పరిశీలనలో ఉంది.  డిసెంబర్ 9వ తేదీన ఢిల్లీలో సభను నిర్వహించనున్నారు కేసీఆర్.  ఈ నెల 5వ తేదీన నిర్వహించే సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో పనిచేసే కో ఆర్డినేటర్ల పేర్లను కూడా ప్రకటించనున్నారు. 

ఈ నెల 6వ తేదీన టీఆర్ఎస్ కు చెందిన ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. ఈ నెల 5వ తేదీన టీఆర్ఎస్ చేసిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అందించనున్నారు టీఆర్ఎస్ బృందం.   2024లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఈ దిశగా కొంత కాలంగా ప్రయత్నాలు  చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలకు చెందిన సీఎంలు, నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వీలుగా  జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ కొంత కాలంగా కసరత్తు నిర్వహించారు.ఈ  కసరత్తు పూర్తైంది. ఇవాళ  పార్టీ జిల్లా  అధ్యక్షులు, మంత్రులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశలో  జాతీయ పార్టీ ఏర్పాటు గురించి కేసీఆర్  వివరించారు. 

also read:దసరా రోజున కొత్త పార్టీ ప్రకటన.. డిసెంబర్ 9న ఢిల్లీలో కేసీఆర్ బహిరంగ సభ

బీజేపీని ఎదుర్కొనేందుకు వీలుగా కేసీఆర్ కార్యాచరణను సద్దం చేసుకుంటున్నారు.  బీజేపీ విధానాలను  కేసీఆర్  తీవ్రంగా ఎండగడుతున్నారు.జాతీయ పార్టీ ఏర్పాటుతో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు.  2018 ఎన్నికలకు ముందు నుండి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్  భావిస్తున్నారు. దసరా నుండి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రానున్నారు.

click me!