
హైదరాబాద్: Paddy ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన న్యూఢిల్లీలోని Telangana Bhavan లో ఆందోళన చేయాలని TRS నిర్ణయం తీసుకొంది. ఈ నెల 11న ఛలో Delhi కి టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. తొలుత జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. చివరికి తెలంగాణ భవన్ లో ఆందోళన చేయాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది.
ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ నెల 11న న్యూఢిల్లీలో ఆందోళనలు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది. ఈ ఆందోళనలపై టీఆర్ఎస్ చీఫ్ KCR పార్టీ నేతలలో చర్చించారు.
వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ తరహ పోరాటం చేస్తామని కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ నెల 11న ఢిల్లీలో ఆందోళన తర్వాత కూడా కేంద్రం నుండి స్పందన రాకపోతే ఏం చేయాలనే దానిపై కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఒకే విధానం ఉండాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. పంజాబ్ రాష్ట్రం నుండి కొనుగోలు చేస్తున్నట్టుగానే తమ రాష్ట్రం నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కూడా టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.ఈ విసయమై గతంలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూస్ గోయల్ తో కూడా తెలంగాణ మంత్రుల బృందం భేటీ అయింది. అయితే కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ తీరును తప్పు బట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయత్నాలు చేస్తుందని పీయూష్ గోయల్ మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో ఎలా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామో తెలంగాణ నుండి కూడా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రంపై వరి ధాన్యం విషయమై టీఆర్ఎస్ ఎంపీలు ఏదో ఒక రూపంలో నిరసనకు దిగుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు రాష్ట్ర రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని కూడా టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
వరి ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్, బీజేపీలు రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. ఈ విషయమై ఈ రెండు పార్టీల తీరును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్పు బడుతున్నారు. రాజకీయ ప్రయోజనాలను మాని వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుంది. ఈ నెల 4వ తేదీ నుండి కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుంది.ఈ ఆందోళనలకు ముగింపుగా వరంగల్ లో ఈ నెల 28న సభనుే నిర్వహించనున్నారు.ఈ సభలో ఎఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొంటారు.వరంగల్ సభ తర్వాతి రోజున హైద్రాబాద్ లో పార్టీ నేతలతో రాహుల్ గాంధీ పాల్గొంటారు.