ఈ నెల 7న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం: కీలకాంశాలపై చర్చ

Published : Feb 05, 2021, 01:06 PM IST
ఈ నెల 7న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం: కీలకాంశాలపై చర్చ

సారాంశం

టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 7వ తేదీన తెలంగాణ భవన్ లో జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ నేతలకు టీఆర్ఎస్ నాయకత్వం ఆహ్వానం పంపింది.

హైదరాబాద్: టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 7వ తేదీన తెలంగాణ భవన్ లో జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ నేతలకు టీఆర్ఎస్ నాయకత్వం ఆహ్వానం పంపింది.ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్ఎస్ భవనంలో నిర్వహించనున్నారు.  పార్టీ సభ్యత్వాల పునరుద్దరణతో పాటు సంస్థాగత ఎన్నికల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

మరో వైపు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక, రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్ధేశం చేసే అవకాశం ఉంది.ఏప్రిల్ 27న పార్టీ అధ్యక్షుడి ఎన్నికతో పాటు పార్టీ మహాసభ నిర్వహణతో పాటు ఇరత్రా అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. జల్లా పరిషత్ ఛైర్మెన్లతో  పాటు నామినేటేడ్ పదవులు పొందిన నేతలను కూడ  సమావేశానికి ఆహ్వానించారు.

ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేతలకు దిశానిర్ధేశం చేసే అవకాశం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?