భర్త విడిచిపెట్టాడు.. ప్రియుడు చంపేశాడు.. పెళ్లికి నిరాకరించిందని...

Published : Feb 05, 2021, 12:23 PM IST
భర్త విడిచిపెట్టాడు.. ప్రియుడు చంపేశాడు.. పెళ్లికి నిరాకరించిందని...

సారాంశం

ఘట్ కేసర్ ప్రాంతంలో కలకలం రేపిన ఖాళీ ప్రదేశంలో మహిళ మృతదేహం కేసుకు పోలీసులు చేధించారు. ప్రియుడే హత్య చేసినట్లు తేలడంతో కేసు మిస్టరీ వీడిపోయింది. డిసెంబర్ 3న వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. 

ఘట్ కేసర్ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ ఎన్. చంద్రబాబు గురువారం వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పలాసాకు చెందిన మల్లిపురం సంతోష (28) పదేళ్ల క్రితం భర్తతో కలిసి జీవనోపాధి కోసం ఘట్ కేసర్ మండలం ఏదులాబాద్ కు వచ్చింది. 

ఇక్కడ శ్రీరామ ఫౌల్ట్రీ ఫారంలో పనిచేస్తూ నివాసం ఉండేవారు. కుటుంబ సమస్యలతో నాలుగేళ్ల కిందట భర్త విడిచి వెళ్లిపోయాడు. కొన్ని రోజులుగా మహారాష్ట్రకు చెందిన వినోద్ (28) సంతోషతో స్నేహం చేస్తున్నాడు.

పెళ్లి చేసుకోమంటూ గొడవ పడుతున్నాడు. డిసెంబర్ 3న మధ్యాహ్నం ఇద్దరు ఏదులాబాద్ దగ్గర్లో ఉన్న ఖాళీ ప్రదేశానికి వెళ్లారు. వినోద్ వెంట తెచ్చుకున్న తాడుతో సంతోషను ఉరివేసి చంపేశాడు. గురువారం తూంకుంటలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

పెళ్లి చేసుకోరు కానీ ఒకే రూమ్‌లో క‌లిసి ఉంటారు.. ఫుడ్డు, బెడ్డు అంతా వాళ్ల‌దే. హైద‌రాబాద్‌లో కొత్త క‌ల్చ‌ర్
KCR Grandson Himanshu : కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో ఏం చదువుకుంటున్నాడో తెలుసా?