
హైదరాబాద్: పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర కమిటీల ఏర్పాటుతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం మంగళవారం నాడు భేటీ అయింది.
ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం ప్రారంభమైంది., పార్టీ సభ్యత్వ కార్యక్రమం ముగిసింది అయితే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల పునర్నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కమిటీల ఏర్పాటుకు సంబంధించిన తేదీలను ఖరారు చేయనున్నారు.
దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకం గురించి విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.