ట్యూషన్ పీజు మాత్రమే వసూలు చేయాలి: ప్రైవేట్ విద్యాసంస్థలకు మంత్రి సబితా ఆదేశం

By narsimha lodeFirst Published Aug 24, 2021, 3:05 PM IST
Highlights


ప్రైవేట్ విద్యాసంస్థలు ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలకు విరుద్దంగా పేరేంట్స్ నుండి ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకొంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు.

హైదరాబాద్: ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని  ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యానికి తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి  రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను పున: ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇవాళ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుతో కలిసి ఆమె  జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆమె మంగళవారంనాడు హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

 ఫీజుల కోసం ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావొద్దని ఆమె కోరారు. ప్రభుత్వ జీవోను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు.

also read:సెప్టెంబర్ 1 నుండి కేజీ టూ పీజీ వరకు అన్ని విద్యా సంస్థల రీఓపెన్: కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు పేరేంట్స్ నుండి  ఫీజుల వసూలు విషయంలో ఒత్తిడి తీసుకురావొద్దని హెచ్చరించింది. అయితే కూడా చాలా విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్దంగా ఫీజులు వసూలు చేశాయి.ఈ విషయమై పేరేంట్స్అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టును కూడా ఆశ్రయించారు.

పూర్తిస్థాయి ఫీజులు చెల్లించలేదనే నెపంతో ఆన్‌లైన్ క్లాసుల లింకులను కూడ కట్ చేశారని కొందరు పేరేంట్స్ త విద్యాశాఖాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.

కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుండి  విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. విద్యాసంస్థలు ప్రారంభమైన నెల రోజులకే మళ్లీ మూతపడ్డాయి.

click me!