టీఆర్ఎస్ బైలాస్‌లో కీలక సవరణలు: కేటీఆర్‌కి మరిన్ని బాధ్యతలు

By narsimha lodeFirst Published Oct 25, 2021, 7:05 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీ నిబంధనావళిలో కీలక సవరణలు చేస్తూ ప్లీనరీలో తీర్మానం చేశారు. పార్టీ అధ్యక్షుడు అందుబాటులో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కు బాధ్యతలు నిర్వహించేలా పార్టీ నిబంధనావళిలో మార్పులు చేశారు.

హైదరాబాద్: Trs  పార్టీ నిబంధనవళిలో కీలక మార్పులు చేస్తూ పార్టీ ప్లీనరీలో తీర్మానం ఆమోదించింది.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అందుబాటులో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్  బాధ్యతలు నిర్వహించేలా పార్టీ నిబంధనావళిని మార్పులు చేస్తూ  టీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానం చేసింది.టీఆర్ఎస్Plenaryలో ఏడు తీర్మానాలు చేసింది ఆ పార్టీ. బీసీ గణన, ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ తీర్మానం చేశారు.దళితబంధు, సంక్షేమం  పై తీర్మానాలను ఆమోదించారు.

also read:TRS Plenary: హైదరాబాద్ హైటెక్స్ లో గులాభీ పండగ... టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిన కేసీఆర్ (ఫోటోలు)

టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించే అధికారం కేసీఆర్ కు అప్పగిస్తూ సమావేశం నిర్ణయం తీసుకొంది. మరో వైపు జిల్లా, నియోజకవర్గాల కార్యవర్గాన్ని నియమించే  అధికారం కూడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే కట్టబెట్టింది పార్టీ ప్లీనరీ..ఎనిమిది గంటల పాటు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జరిగింది.ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. 

2018 డిసెంబర్ 14వ తేదీన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా Ktr ను నియమించారు ఆ పార్టీ చీఫ్ Kcr.  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్ కంటే కేటీఆరే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.  జిల్లాకు చెందిన పార్టీ నేతలతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లాల ఇంచార్జీలతో కేటీఆర్ తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ అవసరమైన దిశానిర్ధేశం చేస్తున్నారు.

ఈ దఫా సంస్థాగత వ్యవహరాలకు సంబంధించిన వ్యవహరాలన్నింటిని కూడా కేటీఆర్ పర్యవేక్షణలో సాగాయి. ఇవాళ నిర్వహించిన పార్టీ ప్లీనరీలో పార్టీ నియామావళిలో కీలక మార్పులు చేయడంతో రానున్న రోజుల్లో పార్టీ వ్యవహరాల్లో కేటీఆర్ మరింత కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి.

click me!