
హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతుంది. మెుదటి రౌండ్ నుంచి ఆఖరి రౌండ్ వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తూనే ఉంది. అయితే ఎవరూ ఊహించనంత రీతిలో టీఆర్ఎస్ పార్టీ భారీ ఆధిక్యత దిశగా పయనిస్తోంది.
ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ 67 స్థానాలను కైవసం చేసుకోగా 18 స్థానాల్లో ఆధిక్యతతో కనబరుస్తోంది. అంటే దాదాపుగా 85 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఇకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి.
పార్టీ అధికారంలోకి రావాలంటే 60 స్థానాల్లో విజయం సాధించాలి. అయితే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మేజిక్ ఫిగర్ ను దాటింది. 60 స్థానాల్లో గెలిచి 67 స్థానాలకు చేరింది. ఇంకా 18 స్థానాల్లో ఆధిక్యత దిశగా కారు జోరుగా పయనిస్తోంది.