తెలంగాణ ఫలితాల్లో అన్నలకు షాక్: తమ్ముళ్ల జోరు

By narsimha lodeFirst Published Dec 11, 2018, 3:36 PM IST
Highlights

ఈ ఎన్నికల్లో  పోటీ చేసిన అన్నదమ్ముల్లో ఒక్కరే అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు


హైదరాబాద్: ఈ ఎన్నికల్లో  పోటీ చేసిన అన్నదమ్ముల్లో ఒక్కరే అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ నుండి పట్నం నరేందర్ రెడ్డి  గెలిచారు. ఈ ఎన్నికల్లో అన్నలు ఓటమి పాలైతే, తమ్ముళ్లు విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

టీఆర్ఎస్ అభ్యర్థులుగా  తాండూరు నుండి  పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ నుండి ఆయన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేశారు.

కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పట్నం నరేందర్ రెడ్డి ఓడించారు. తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

ఇక కాంగ్రెస్ పార్టీ నుండి నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు నుండి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీచేశారు.  నల్గొండ నుండి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి పాలయ్యారు.టీఆర్ఎస్  అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో కంచర్ల భూపాల్ రెడ్డి‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం  సాధించారు.

ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ తరపున మల్లు రవి పోటీ చేయగా, ఖమ్మం జిల్లాలోని మధిర నుండి ఆయన సోదరుడు మల్లు భట్టి విక్రమార్క పోటీ చేశారు. జడ్చర్ల నుండి మల్లు రవి ఓటమి పాలయ్యారు.మధిర నుండి భట్టి విక్రమార్క విజయం సాధించారు.

click me!