ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ తో కుమ్మక్కు: పీసీసీ చీఫ్ ఉత్తమ్

By Nagaraju TFirst Published Dec 11, 2018, 3:45 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కు అయ్యిందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు జరిగినప్పటి నుంచి కేసీఆర్ చెప్పినట్లే ఎలక్షన్ కమిషన్ వింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కు అయ్యిందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు జరిగినప్పటి నుంచి కేసీఆర్ చెప్పినట్లే ఎలక్షన్ కమిషన్ వింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

సెప్టెంబర్ 6 నుంచి ప్రస్తుతం జరిగిన ఎన్నికల ఫలితాల వరకు కేసీఆర్ చెప్పిందే ఎన్నికల కమిషన్ చేసిందని తేటతెల్లమవుతుందన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కూడా కేసీఆర్ చెప్పినట్లే విడుదలైంది అన్నారు. 

అలాగే వీవీప్యాట్ లను ఎందుకు లెక్కింపు చెయ్యడం లేదో అర్థం కావడం లేదని ఆరోపించారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదన్నారు. పేపర్ ట్రేల్స్ లెక్క చెయ్యకుంటే డెమక్రసీకి ఈరోజు బ్లాక్ డేగా నిలిచిపోతుందన్నారు. 

ధర్మపురి నియోజకవర్గంలో లక్ష్మణ్ కుమార్ 491ఓట్లు తేడాతో ఓడిపోవడం అంటే ఈవీఎంలలో ఏదో జరుగుతుందని ఆరోపించారు. బూత్ లలో పడిన ఓట్లకు ఈవీఎంలలో కౌంటింగ్ అయిన లెక్కలకు సంబంధం ఉండటం లేదన్నారు. పేపర్ ట్రేలు ఎందుకు లెక్కచెయ్యడం లేదో ఎన్నికల కమిషన్ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.  ఓటింగ్ సరళికి,ఈవీఎం కౌంటింగ్ కు సంబంధం లేదన్నారు. 
 

click me!