టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం...తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్

By Arun Kumar PFirst Published Aug 13, 2018, 4:34 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఇవాళ తలపెట్టిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ పార్టీ నాయకులతో చర్చించనున్నారు. ఈ సమావేశం కోసం తెలంగాణ భవన్ లో భారీ ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ కు చేరుకోవడంతో ఈ సమావేశం ప్రారంభమైంది.

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈ కార్యవర్గ సమావేశానికి సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు వంటి బృహత్తర కార్యక్రమాలను చేపట్టడంతో పాటు భవిష్యత్ లో రైతులు, ప్రజల సంక్షేమం కోసం మరిన్ని పథకాలను తీసురానున్నట్లు ప్రకటించింది.  ఈ నెల 15 నుండి రైతు భీమా పథకం, కంటి వెలుగు వంటి పథకాలు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా ప్రజలకు మేలు చేయడమే కాకుండా, ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సీఎం చూస్తున్నారు. అందుకోసం ఈ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలి, ప్రచారం ఎలా కల్పించాలన్న దానికి కేసీఆర్ పార్టీ నాయకులతో చర్చించనున్నారు.

అంతే కాంకుండా తాజా రాజకీయ పరిణాలపై కూడా ఈ సమావేశంలో నాయకులతో సీఎం చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు,పార్టీ సీనియర్
నాయకులు  హాజరయ్యారు.
 
click me!