గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఉండదు, ఒక్కటే ట్యాక్స్: రాహుల్

Published : Aug 13, 2018, 04:34 PM ISTUpdated : Sep 09, 2018, 11:35 AM IST
గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఉండదు, ఒక్కటే ట్యాక్స్: రాహుల్

సారాంశం

 మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తాము అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా చేయూత అందిస్తామని  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. రెండు రోజుల పాటు పర్యటన నిమిత్తం  ఆయన సోమవారం నాడు హైద్రాబాద్‌కు వచ్చారు. 

హైదరాబాద్: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తాము అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా చేయూత అందిస్తామని  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. రెండు రోజుల పాటు పర్యటన నిమిత్తం  ఆయన సోమవారం నాడు హైద్రాబాద్‌కు వచ్చారు. 

హైద్రాబాద్ ‌లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన డ్వాక్రా సంఘాల సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పలు డ్వాక్రా సంఘాల మహిళల సమస్యలను ఆయన అడిగారు. వారి ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 

రెండేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వం 15 మంది పారిశ్రామికవేత్తలకు 2.5 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేసిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు.మోడీ ప్రభుత్వం సామాన్యులకు ఏం చేయలేదని ఆయన ప్రశ్నించారు. 

కేవలం పారిశ్రామికవేత్తలకు మాత్రమే మోడీ సర్కార్  రుణాలను మాఫీ చేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే  కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలను అన్ని రంగాల్లోని  ముందంజలోకి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు.

తెలంగాణలోని కేసీఆర్, ఢిల్లీలోని మోడీ సర్కార్ పెద్ద వ్యాపారులకు మాత్రమే లోన్లు ఇస్తున్నారు. హైద్రాబాద్, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తే  చిన్న వ్యాపారులు, డ్వాక్రా  సంఘాలకు రుణాలను ఇవ్వనున్నట్టు చెప్పారు.

రైతులకు  మద్దతు ధరకు రూ.10వేల కోట్లు పెంచనున్నట్టు ప్రచారం చేసుకొన్నారు.  దేశ వ్యాప్తంగా  పలు రాష్ట్రాల్లో ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 30వేల కోట్ల రూపాయాలు రైతులకు రుణాన్ని మాఫీ చేసిందని ఆయన గుర్తు చేశారు.  మోడీ సర్కార్ పదివేల కోట్లు పెంచుతామని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో  మోడీ సర్కార్‌ కంటే  రెట్టింపు  రుణాలను  మాఫీ చేసిందని ఆయన  గుర్తు చేశారు.


తెలంగాణ, ఏపీలోని డ్వాక్రా సంఘాలు  యూపీలో డ్వాక్రా సంఘాల్లో ఏర్పాటు లో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ మహిళ సంఘాలు పనిచేయకపోతే యూపీలో  డ్వాక్రా సంఘాలు ఉండేవి కావు.

మోడీ నల్లధనాన్ని తీసుకువస్తానన్నారు. కానీ, మన జేబుల్లోని డబ్బులను మోడీ తీసుకొంటున్నారని  ఆయన  ఆరోపించారు.  మహిళు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేందుకు  కాంగ్రెస్ పార్టీ చేయూత ఇవ్వనున్నట్టు ఆయన హమీ ఇచ్చారు. 

నోట్లు రద్దైన సమయంలో  సామాన్యులు  బ్యాంకుల వద్ద  క్యూల్లో నిలబడ్డారని చెప్పారు.  కానీ, బడా పారిశ్రామికవేత్తలు ఎందుకు బ్యాంకుల వద్ద ఎందుకు నిలబడలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

జీఎస్టీ అంటే గబ్బర్‌సింగ్ ట్యాక్స్ అని రాహుల్ గాంధీ చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జీఎస్టీ ఒకే ట్యాక్స్ ఉంటుంది. ఐదు రకాల స్లాబ్స్ ఉండవు.  ప్రతి నెలా వేర్వేరు ఫారాలు నింపే అవకాశం ఉండదు.

కాంగ్రెస్ పార్టీ  మహిళలు ప్రగతి లేకుండా  దేశం అభివృద్ధి చెందదని నమ్ముతాం.  అందుకే స్వయంసహాయక బృందాలకు సహాయం చేసినట్టు ఆయన చెప్పారు.ఢిల్లీ, లేదా తెలంగాణ సర్కార్‌లు  దేశ ప్రగతిలో  మహిళల శక్తి అవసరం లేదని భావిస్తున్నాయని రాహుల్‌గాంధీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.

తెలంగాణలో ఏ రకమైన పద్దతులను కేసీఆర్ అవలంభిస్తున్నాడో మోడీ కూడ  అదే రకమైన పద్దతులను అవలంభిస్తున్నాడని రాహుల్  విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?