కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుండి తరిమికొట్టాలి: ఉత్తమ్

By narsimha lodeFirst Published Aug 13, 2018, 4:16 PM IST
Highlights

తమ పార్టీ అధికారంలోకి వస్తే  డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీని  మాఫీ చేస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.  తెలంగాణ లో రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పర్యటన సోమవారం నాడు ప్రారంభమైంది. 
 

హైదరాబాద్: తమ పార్టీ అధికారంలోకి వస్తే  డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీని  మాఫీ చేస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.  తెలంగాణ లో రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పర్యటన సోమవారం నాడు ప్రారంభమైంది. 

ఈ సందర్భంగా క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం నాడు నిర్వహించిన మహిళా సంఘాల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో రాహుల్ గాంధీతో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. 

కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాలను కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే  రెండు వేల కోట్లు బకాయిలు ఉంది.  డ్వాక్రా రుణాల వడ్డీ రాయితీ ఇచ్చేందుకు కేసీఆర్ సర్కార్ వద్ద డబ్బులు లేవా ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల కోట్ల బకాయిలను రద్దు చేస్తామన్నారు. అభయ హస్తం పథకాన్ని పునరుద్దరణ చేయనున్నట్టు  ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

5 లక్షల ప్రమాద భీమాను కూడ వర్తింపజేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.  భీమా మిత్రలకు, విలేజ్ అసిస్టెంట్లకు  ప్రతి నెల రూ.7 వేల ఇవ్వనున్నట్టు చెప్పారు సెర్ప్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను  రెగ్యులరైజ్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అనేక విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణలో అన్ని వర్గాలకు ప్రయోజనాన్ని కల్పించనున్నట్టు ఆయన హమీ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ను  ఆ కుటుంబాన్ని తరిమికొట్టాలని  ఆయన డ్వాక్రా సంఘాల మహిళలను కోరారు. 

click me!