ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు.. నిర్మాణానికి భూమి కేటాయింపు..

By AN TeluguFirst Published Nov 4, 2020, 4:10 PM IST
Highlights

ఢిల్లీ వసంత్ విహార్లో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం 1100 చదరపు మీటర్ల స్థలం అప్పగింత ప్రక్రియ పూర్తయ్యింది. పార్టీ తరుపున కేంద్ర ప్రభుత్వం నుండి స్థల కేటాయింపు పత్రాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందుకున్నారు.

"ఇరవై యేండ్ల క్రితం ఒక్కడితో మొదలైన ఉద్యమ ప్రస్థానం ఇవ్వాళ ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ ఆత్మ గౌరవ పతాకం ఎగరేసే దాకా వచ్చింది. మొక్కవోని పోరాట పటిమతో సబ్బండ వర్గాలను ఏకం చేసి, చివరకు ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సమితికి త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో గొప్ప కార్యాలయం నిర్మాణం కానుంది. ఇది పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ గర్వకారణం. ఇంతటి బృహత్తర కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు" అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలు మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుండి స్థల కేటాయింపు పత్రాలను రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు అందుకున్నారు.

click me!