నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో... ఎల్లారెడ్డిలో అదృశ్యమైన బాలిక మృతదేహం...

Bukka Sumabala   | Asianet News
Published : Nov 04, 2020, 12:05 PM IST
నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో...  ఎల్లారెడ్డిలో అదృశ్యమైన బాలిక మృతదేహం...

సారాంశం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చిన్నారి సౌమ్య అదృశ్యం విషాదాంతం అయింది. మంగళవారం ఉదయం అదృశ్యమైన చిన్నారి, బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో మృతదేహంగా లభ్యమయ్యింది. 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చిన్నారి సౌమ్య అదృశ్యం విషాదాంతం అయింది. మంగళవారం ఉదయం అదృశ్యమైన చిన్నారి, బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో మృతదేహంగా లభ్యమయ్యింది. 

వివరాల్లోకి వెడితే ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామానికి చెందిన కిష్టయ్య, స్వరూప దంపతుల మూడో కుమార్తె సౌమ్య. మంగళవారం ఉదయం ఇంటిముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. 

కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించినప్పటికి జాడ తెలియకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగి డాగ్ స్క్వాడ్ తో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. 

ఈ క్రమంలోనే బుధవారం చిన్నారి మృతదేహాన్ని నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో స్థానికులు గుర్తించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించారు. చిన్నారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై శ్వేత తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

Health: ఉచితంగా కంటి ప‌రీక్షల శిబిరం.. నెల‌రోజుల పాటు అవ‌కాశం, ఎక్క‌డంటే.?
పెళ్లి చేసుకోరు కానీ ఒకే రూమ్‌లో క‌లిసి ఉంటారు.. ఫుడ్డు, బెడ్డు అంతా వాళ్ల‌దే. హైద‌రాబాద్‌లో కొత్త క‌ల్చ‌ర్