కరోనా ఎఫెక్ట్: ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్ క్లాసులే.. తర్వాతే క్యాంపస్ ఎంట్రీ, జేఎన్‌టీయూ కీలక నిర్ణయం

Siva Kodati |  
Published : Jan 30, 2022, 07:03 PM IST
కరోనా ఎఫెక్ట్: ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్ క్లాసులే.. తర్వాతే క్యాంపస్ ఎంట్రీ, జేఎన్‌టీయూ కీలక నిర్ణయం

సారాంశం

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ -హైదరాబాద్ (JNTU-H) కీలక నిర్ణయం తీసుకుంది. అండర్ గ్రాడ్యుయేట్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయని యూనివర్సిటీ ప్రకటించింది

దేశంలో కోవిడ్ తీవ్రత నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరికొన్ని చోట్ల ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ -హైదరాబాద్ (JNTU-H) కీలక నిర్ణయం తీసుకుంది. అండర్ గ్రాడ్యుయేట్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయని యూనివర్సిటీ ప్రకటించింది. తరువాత, కోవిడ్-19 ప్రోటోకాల్ అనుసరించి వారికి క్యాంపస్‌లో తరగతులు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. 

అండర్ గ్రాడ్యుయేట్‌ మూడు, నాల్గవ సంవత్సరంతో పాటు ఫార్మ్ డితో సహా అన్ని పీజీ కోర్సులకు క్లాస్‌వర్క్, పరీక్షలు ఫిబ్రవరి 1 నుండి క్యాంపస్‌లో నిర్వహిస్తామన్నారు. విశ్వవిద్యాలయం దాని అన్ని రాజ్యాంగ మరియు అనుబంధ కళాశాలలకు తెలియజేస్తూ ఒక లేఖను విడుదల చేసింది. వివిధ కోర్సుల తరగతుల నిర్వహణపై, ఫిబ్రవరి 1 నుండి అన్ని విద్యా సంస్థలను తిరిగి తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం అనుమతించినందున ఫిజికల్ క్లాస్‌ల కోసం కళాశాలలను తిరిగి తెరవడానికి విశ్వవిద్యాలయంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

మరోవైపు తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయని చెప్పారు.  విద్యాసంస్థల యాజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
స్కూల్స్, కాలేజ్‌లు తెరవడానికి ముందు పూర్తిగా శానిటైజేషన్ నిర్వహించాలని నిర్ణయించారు.  విద్యాసంస్థల్లో అర్హులకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇక, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తక్కువగా ఉందన్న వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదించింది. 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. ఇందులో సంక్రాంతి సెలవులు (Sankranti holidays) కూడా కలిసివచ్చాయి. ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి. అయితే కరోనా కేసులు మాత్రం రోజురోజుకు పెరగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవులను పొడగించనుందనే కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

ఈ క్రమంలోనే ఈనెల 30 వరకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. అయితే కొద్ది రోజులుగా 8వ తరగతి నుంచి ఆపై తరగతులకు ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు పాటిస్తూ స్కూళ్లను తెరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యా సంస్థల రీ ఓపెన్‌కు తెలంగాణ వైద్య, విద్య శాఖల అధికారులు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే విద్యాసంస్థలను రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇరాన్‌లో యుద్ధం... హైద‌రాబాద్‌లో పూరీ, దోసెలు బంద్ చేస్తున్న హోట‌ళ్లు. అస‌లేంటీ లాజిక్
Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu