చిన్న కులం అధికారులు: మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

By telugu teamFirst Published Feb 1, 2021, 7:12 PM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. చిన్న కులం ఉన్నతాధికారులకు అక్షరం ముక్క రాదని ఆయన అన్నారు. దీంతో దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

వరంగల్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. చిన్న కులం అధికారులకు అక్షరం ముక్క రాదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  ఓసీ మహాగర్జనలో ఆయన చల్లా ధర్మారెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. ఏ ఆఫీసుకు వెళ్లినా వారే ఉన్నతాధికారులుగా కనిపిస్తున్నారని, వారికి పని రాదని, ఇలాంటి వాళ్ల వల్లే రాష్ట్రం నాశనమవుతుందని ఆయన అన్నారు.  

చల్లా ధర్మా రెడ్డిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెసు నాయకుడు శ్రవణ్ డిమాండ్ చేశారు అగ్రవర్ణ దురహంకారంతో చల్లా ధర్మారెడ్డి మాట్లాడారని ఆయన అన్నారు. అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.

Also Read: అయోధ్య విరాళాలపై వ్యాఖ్యలు: చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ దాడి

తన వ్యాఖ్యలను వక్రీకరించారని చల్లా ధర్మా రెడ్డి అన్నారు. తనపై బురద చల్లేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యలు తప్పయితే వాటిని ఉపసంహరించుకుంటున్నానని ఆయన చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ఆయన కోరారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై వివరించే క్రమంలో తాను వ్యాఖ్యలు చేశానని ఆయన చెప్పారు. రిజర్వేషన్లు ఏ కులానికి కూడా తగ్గించాలని తాను అనలేదని ఆయన అన్నారు. 

అయోధ్యలో రామాలయ నిర్మాణ నిధుల సేకరణపై కొద్ది రోజుల క్రితం చల్లా ధర్మారెడ్డి ఓ సమావేశంలో మాట్లాడారు. ఆ మాటలపై బిజెపి నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. బిజెపి కార్యకర్తలు ఆందోళనకు కూడా దిగారు. రామాలయం నిర్మాణఁ పేరుతో బిజెపి శ్రేణులు ఇంటికికి వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయని, దొంగ బుక్కులు పట్టుకుని చందాల దందాకు పాల్పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 

Also Read: దొంగ బుక్కులతో రామయ్యకి చందాలు: బీజేపీపై చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలు

ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు వేయి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, దీన్ని బట్ిట దేశంలో ఎంత వసూలు చేస్తారో ఆని ఆయన అన్నారు. అయోధ్య రామాలయం పేరుతో వసూలు చేస్తున్న నిధులకు లెక్క చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లెక్కలు చెప్పే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు శ్రీరాముడి పేరుతో బిజెపి రాజకీయం చేయాలని చూస్తోదని, , వికృత చేష్టలకు పాల్పడుతోందని ఆయన అన్నారు.  

click me!