హైదరాబాద్ అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టురట్టు

Arun Kumar P   | Asianet News
Published : Feb 01, 2021, 04:26 PM ISTUpdated : Feb 01, 2021, 04:42 PM IST
హైదరాబాద్ అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టురట్టు

సారాంశం

హైదరాబాద్ లోని షేక్ పేట లో ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని గుట్టుగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. 

హైదరాబాద్: విదేశీ మహిళలతో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ లోని షేక్ పేట లో ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని గుట్టుగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అపార్ట్ మెంట్ పై దాడిచేసి నిర్వహకులతో పాటు విదేశీ మహిళలను అరెస్ట్ చేశారు. 

పోలీసుల తనిఖీల్లో ఇద్దరు నైజీరియన్‌లతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

ఇటీవల ఫిజియోథెరపీ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఖైరతాబాద్‌లోని  ఫిజియోథెరపీ క్లినిక్‌ పేరుతో మసాజ్‌ సెంటర్‌ సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా అక్కడ కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా ప్లాన్‌‌తో ఓ కానిస్టేబుల్‌ను మఫ్టీలో క్లినిక్‌కు పంపారు.

అనంతరం కానిస్టేబుల్‌ వారికి డబ్బులిస్తుండగా పోలీసులు దాడి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఫిజియోథెరపీ సెంటర్‌ నిర్వాహకురాలితో పాటు, ఇద్దరు యువతులు, మరో నలుగురు విటులను అరెస్ట్‌ చేశారు. ఇలా హైదరాబాద్ లో విచ్చలవిడిగా వ్యభిచార దందా సాగుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్