ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌కి కరోనా: హోం క్వారంటైన్‌లో టీఆర్ఎస్ నేత

Published : Apr 22, 2021, 03:17 PM ISTUpdated : Apr 22, 2021, 03:32 PM IST
ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌కి కరోనా: హోం క్వారంటైన్‌లో టీఆర్ఎస్ నేత

సారాంశం

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు కరోనా సోకింది.  తెలంగాణ సీఎంతో పాటు సంతోష్ కుమార్ ఉంటారు. దీంతో ఆయనకు కూడ ఈ వైరస్ సోకిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు కరోనా సోకింది.  తెలంగాణ సీఎంతో పాటు సంతోష్ కుమార్ ఉంటారు. దీంతో ఆయనకు కూడ ఈ వైరస్ సోకిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు ఎలాంటి లక్షణాలు కూడ లేవని ఆయన తెలిపారు.  వైద్యుల సూచన మేరకు తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్టుగా ఆయన చెప్పారు. తనను ఇటీవల కాలంలో కలిసిన వారంతా కూడ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

also read:యశోదాలో వైద్య పరీక్షలు పూర్తి.. నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం: వ్యక్తిగత వైద్యుడు


ఈ నెల 19వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ కి కరోనా సోకింది. దీంతో ఆయన ఎర్రవెల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో హోం క్వారంటైన్ లో ఉంటున్నాడు. పరీక్షల నిమిత్తం సీఎం కేసీఆర్ బుధవారం నాడు యశోద ఆసుపత్రికి వచ్చారు. కేసీర్ ఎక్కడికి వెళ్లినా సంతోష్ కుమార్ ఆయన వెంటనే ఉంటారు. 
 


 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?