రెమిడిసివర్ విషయంలో కేంద్రం షాకింగ్ న్యూస్ ఇచ్చిందన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెమిడిసివర్ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతోందని ఆయన స్పష్టం చేశారు.
రెమిడిసివర్ విషయంలో కేంద్రం షాకింగ్ న్యూస్ ఇచ్చిందన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెమిడిసివర్ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతోందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్‌కు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారని ఈటల వెల్లడించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.
ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజేందర్ హెచ్చరించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం కోవిడ్‌పై సమర్ధవంతంగా పనిచేస్తోందని ఆయన వెల్లడించారు.
Also Read:తెలంగాణలో 24 గంటల్లో కరోనాతో 23 మంది మృతి: కొత్తగా 5,567 కేసులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని.. తాము రానియమని ఈటల పేర్కొన్నారు. అవసరమైతే తప్పించి ప్రయాణాలు పెట్టుకోవద్దని.. కేసులు కూడా పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా వస్తున్నాయని రాజేందర్ వెల్లడించారు.
రెమిడిసివర్ ఇంజెక్షన్‌ను కేంద్రం తన పరిధిలోకి తీసుకుందని.. కేంద్రం తీరు చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి నిరసన తెలిమజేశామని... రెమిడిసివర్ కొరత రాకుండా 4 లక్షల డోసులు ఆర్డర్ పెట్టామని రాజేందర్ వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 6000 బెడ్లను అదనంగా ఏర్పాటు చేశామని తెలిపారు. కిట్ల కొరత రాష్ట్రంలో లేదని.. పరీక్షలను సంఖ్యను 2 లక్షలకు పెంచామని ఆయన వెల్లడించారు.
రోజుకు 384 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోందని..కానీ కేవలం 260-270 టన్నుల ఆక్సిజన్ మాత్రమే వస్తోందని మంత్రి తెలిపారు. గుజరాత్‌ను ఒకలా.. తెలంగాణను మరోలా చూడొద్దని ఈటల ఎద్దేవా చేశారు. కేంద్రం కొంటే రూ.150.. రాష్ట్రం కొంటే రూ.4 వందలా అని రాజేందర్ ప్రశ్నించారు.
కేంద్రానికి ఒక ధర.. రాష్ట్రాలకు ఒక ధర మంచిది కాదని ఈటల పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేంద్రమే వ్యాక్సిన్ పంపిణీ చేసిందని.. భవిష్యత్‌లో కూడా కేంద్రమే టీకా ఇస్తుందని భావించామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీలో ఆక్సిజన్ బెడ్లు మాత్రమే ఖాళీగా వున్నాయని రాజేందర్ పేర్కొన్నారు.