వాళ్లిద్దరూ నాకు యశోద, దేవకీ లాంటి వారు: మహిళా దినోత్సవ వేళ ఎంపీ సంతోష్ భావోద్వేగం

By Siva KodatiFirst Published Mar 8, 2021, 9:45 PM IST
Highlights

టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల పట్ల, ముఖ్యంగా తన కుటుంబంలోని స్త్రీ మూర్తులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మేరకు సంతోష్ సోషల్ మీడియాలో ఉద్వేగభరిత పోస్ట్ చేశారు.

తన జీవితంలో పెద్దమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ, తన తల్లి, భార్య తన అక్క చెల్లెల్లు ఉండటం తన అదృష్టమని చెప్పారు. తాను అమ్మాయిలను, అబ్బాయిలను సమానంగా చూసే వాతావరణంలో పెరిగానని సంతోష్ వెల్లడించారు.

ఆ పోస్ట్ లో తన పెద్దమ్మ 1980లలోనే కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్ధిపేటలోని తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి పంపేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. అందుకే పెద్దమ్మ తనకు అచ్చం అన్నపూర్ణ దేవి లాగా అనిపించేదని సంతోష్ చెప్పారు. 

ఇక తన అర్థాంగి రోహిణి గురించి కూడా ఆ పోస్ట్ లో చెప్పుకొచ్చారు. తన భర్త ఎంతో బిజీగా ఉంటాడని తెలిసి రోజుకు మూడు సార్లు కాల్ చేస్తుందని తెలిపారు. అది కూడా తాను తిన్నానో లేదో తెలుసుకోవటానికి ఫోన్ చేస్తుందని సంతోష్ భావోద్వేగానికి గురయ్యారు. తన పెద్దమ్మ తన తల్లి తనకు యశోద, దేవకీ లాంటి వారని వాళ్ళు తనకు దేవతల సంతోష్ కొనియాడారు. 
 
click me!