తెలంగాణపై కేంద్రానికి ఎందుకు కక్ష: టీఆర్ఎస్ ఎంపీ నామా

Published : Mar 25, 2022, 12:43 PM ISTUpdated : Mar 25, 2022, 12:46 PM IST
తెలంగాణపై కేంద్రానికి ఎందుకు కక్ష: టీఆర్ఎస్ ఎంపీ నామా

సారాంశం

తెలంగాణకు నవోదయ స్కూల్స్ మంజూరు చేయకుండా కేంద్రం ఎందుకు కక్ష చూపుతుందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఇవాళ న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

న్యూఢిల్లీ: దేశంలో  80 నవోదయ విద్యా సంస్థలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఒక్క నవోదయ స్కూల్ ను కూడా మంజూరు చేయలేదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు.

శుక్రవారం నాడు న్యూఢిల్లీలో Nama Nageswara rao మీడియాతో మాల్లాడారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆయన ప్రశ్నించాు. పిల్లలు చదువుకునే Navodaya విద్యాలయాల మంజూరు విషయంలో కూడా ఇంత వివక్ష అవసరమా అని ఆయన ప్రశ్నించారు. నవోదయ విద్యాలయాలతో పాటు ఇతర అంశాలపై కూడా తెలంగాణకు న్యాయం చేయాలని కూడా తెలంగాణ సీఎం KCR ప్రధాని Narendra modi కి రాసిన పలు లేఖల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారని నామా నాగేశ్వరరావు గుర్తు చేశారు.

తాము కూడా ఈ విషయాలపై కేంద్ర మంత్రులను కోరిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.  తెలంగాణ అభివృద్దిని కేంద్రం అడ్డుకుంటున్నారని చెప్పడానికి ఇంతకంటే మరో సాక్ష్యం అవసరం లేదని నామా నాగేశ్వరరావు చెప్పారు.తెలంగాణపై కేంద్రానికి ఎందుకు ఇంత కక్ష అని నామా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంంలో భాగస్వామ్యులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ప్రజా ప్రతినిధులు ఈ విషయమై  ఎందుకు నోర,మెదపడం  లేదని ఆయన ప్రశ్నించారు.

 అంతకుముందు నవోద‌య విద్యాల‌యాల ఏర్పాటు గురించి పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజ్య‌స‌భ‌లో రూల్ 222 కింద ఈ అంశాన్ని చ‌ర్చించాల‌ని వాయిదా తీర్మానంలో టీఆర్ఎస్ నేత ఎంపీ కే కేశ‌వ రావు కోరారు. ఇదే అంశాన్ని చ‌ర్చించాల‌ని Loksabha లో టీఆర్ఎస్ ప‌క్ష నేత నామా నాగేశ్వ‌ర‌రావు వాయిదా తీర్మానం ఇచ్చారు.

విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ నవోదయ విద్యాలయ సమితి అనే విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు గుర్తు చేశారు.  దేశంలోని అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాల‌ను ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఈ విద్యాలయాలు నాణ్యమైన విద్యలో అగ్రగామిగా ఉన్నాయి.

రాష్ట్రాలలోని ఇతర సంస్థలకు ఇవి ఆదర్శంగా పనిచేస్తాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల ప్రకటన జరిగింది. నవోదయ విద్యాలయాల స్థాపన విద్యా రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అకడమిక్ ఎక్సలెన్స్ కోసం ఆ విద్యాల‌యాల ఏర్పాటు తప్పనిసరి. నూతన విద్యా సంవత్సరం అమలులోకి వస్తున్నందున ఈ అంశం చాలా ముఖ్యమైనదని వాయిదా తీర్మానంలో కేశవరావు, నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు

పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతి రోజూ కేంద్రం తీరుపై నిరసనకు దిగాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగుతున్నారు. వరి ధాన్యం కొనుగోలుతో పాటు రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాలను పార్లమెంట్ వేదికగా ఎత్తి చూపేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అయితే కేంద్రం నుండి సానుకూల స్పందన రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఆందోళనలకు ప్లాన్ చేస్తుంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్