సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: టీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ధీమా

Published : Dec 10, 2018, 05:13 PM IST
సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: టీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ధీమా

సారాంశం

తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇతర పార్టీల మద్దతు అవసరం లేదని స్పష్టం చేశారు.   


గజ్వేల్: తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇతర పార్టీల మద్దతు అవసరం లేదని స్పష్టం చేశారు. 

గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్‌ నియోజకవర్గంలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని స్పష్టం చేశారు. భారీగా డబ్బు ఖర్చు చేసి, గెలుస్తామని ప్రత్యర్థులు ఆశ పడుతున్నారని అవేమీ చెల్లవన్నారు. కాంగ్రెస్ అంచనాలు తలకిందులు కావాల్సిందేనన్నారు. 

గజ్వేల్‌లో కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని ప్రజలు ఆదరించారని తెలిపారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని, ఇతర పార్టీల మద్దతు లేకుండానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎంపీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు
Sankranti : సంక్రాంతికి ఈ గుడికి వెళ్తే మీ జాతకం మారిపోవడం ఖాయం ! పట్టిందల్లా బంగారమే!