చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిపై మర్రి సంచలన ఆరోపణలు

Published : Dec 10, 2018, 04:43 PM IST
చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిపై మర్రి సంచలన ఆరోపణలు

సారాంశం

కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది. తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు  ఫోన్లు  చేసి కూటమికి మద్దతు ఇవ్వాలని  కోరుతున్నట్టు టీఆర్ఎస్ ప్రకటించింది. 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది. తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు  ఫోన్లు  చేసి కూటమికి మద్దతు ఇవ్వాలని  కోరుతున్నట్టు టీఆర్ఎస్ ప్రకటించింది. 

సోమవారం నాడు టీఆర్ఎస్  భవనంలో  నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తనకు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని కోరినట్టు చెప్పారు. రెండు సార్లు విశ్వేశ్వర్ రెడ్డి తనకు ఫోన్ చేశారని  ఆయన గుర్తు చేశారు. 9490861960 అనే నెంబర్ నుండి విశ్వేశ్వర్ రెడ్డి తనకు ఫోన్ చేశారని  మర్రి జనార్ధన్ రెడ్డి చెప్పారు.

ఈ ఎన్నికల్లో  పూర్తి మెజారిటీ రానందున కాంగ్రెస్ పార్టీ నేతృత్ంలోని కూటమికి మద్దతివ్వాలని విశ్వేశ్వర్ రెడ్డి తనను కోరారని మర్రిజనార్ధన్ రెడ్డి చెప్పారు. జానారెడ్డి ఇంట్లో సమావేశానికి  హాజరుకావాలని  ఆయన కోరారు.

మధ్యాహ్నం రెండు గంటలకు ఒకసారి, మరో సారి 2.56 నిమిషాలకు మరో ఫోన్ వచ్చిందన్నారు.  తనకు  వచ్చిన ఫోన్ నెంబర్‌ను మర్రి జనార్ధన్ రెడ్డి  మీడియా సమావేశంలో  చూపారు.తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రలోభపెట్టే ప్రయత్నాలుచేస్తున్నారని ఆరోపించారు.
 

PREV
click me!

Recommended Stories

KCR: కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ
KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu