వారిద్దరు కృష్ణా పుష్కరాల్లో తప్పిపోయిన కవలలు: కవిత సెటైర్

By Arun Kumar PFirst Published Nov 21, 2018, 6:52 PM IST
Highlights

30 ఏళ్లుగా కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి, టిడిపి నేత ఎల్.రమణలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుని ఇప్పుడు కృష్ణా పుష్కరాల్లో తప్పిపోయిన కవల పిల్లల మాదిరిగా ఒకటే ప్రేమ ఒలకబోసుకుంటున్నారు నిజామాబాద్ ఎంపి కవిత సెటైర్లు వేశారు. గతంలో వీరితద్దరూ జగిత్యాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా పనిచేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో జగిత్యాలలో వీరు చేసిన అభివృద్ది ఏమీ లేదని కవిత విమర్శించారు. 

30 ఏళ్లుగా కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి, టిడిపి నేత ఎల్.రమణలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుని ఇప్పుడు కృష్ణా పుష్కరాల్లో తప్పిపోయిన కవల పిల్లల మాదిరిగా ఒకటే ప్రేమ ఒలకబోసుకుంటున్నారు నిజామాబాద్ ఎంపి కవిత సెటైర్లు వేశారు. గతంలో వీరితద్దరూ జగిత్యాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా పనిచేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో జగిత్యాలలో వీరు చేసిన అభివృద్ది ఏమీ లేదని కవిత విమర్శించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత బుధవారం జగిత్యాల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని  ధరూర్, నర్సింగాపూర్, వంజర పల్లి,గొల్లపల్లి, వెల్దుర్తి, మోతే, చల్‌గల్ మోరపల్లి, సింగరావు పేట, అల్లీపూర్, అయోధ్య, ఉప్పు మడుగు, కుమ్మర్ పల్లి, రాయికల్ లలో రోడ్ షో లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జగిత్యాల నుంచి టిఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలని కవిత సూచించారు. ఈ ఎన్నికల్లో 100 సీట్లను సాధించడం ఖాయమన్నారు. జగిత్యాలను గెలుచుకొని కేసీఆర్ కానుకగా ఇవ్వాలని కవిత ప్రజలకు సూచించారు.

జగిత్యాలకు ఎనిమిది వందల కోట్ల రూపాయలను తెచ్చిన కేసిఆర్ ముద్దుల తనయ వాటి లెక్కలు చెప్పు అని జీవన్ రెడ్డి అడిగారని గుర్తు చేసిన కవిత...ఆ లెక్కలు చెప్తే ఇప్పుడు చప్పుడు చేయడం లేదన్నారు. తాను కేసీఆర్ ముద్దుల తనయనే కాదు... తెలంగాణ ఉద్యమ తనయనని  కవిత చెప్పారు.

 జీవన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడైనప్పటికి మాట మీద నిలబడే మనిషి కాదన్నారు. గత ఎన్నికల్లో ప్రజల కడుపులో తలపెట్టి ఇదే ఆఖరి సారి అని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అన్న జీవన్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు మాట మీద నిలబడాలి, అలా నిలబడలేని వారు ప్రజలకు ఏం చేస్తారని కవిత ప్రశ్నించారు.  

కూటమి పేరిట జట్టు కట్టిన కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, జన సమితి కేసీఆర్ ను గద్దె దించుతామంటున్నాయని...అసలు ఆయన్ను ఎందుకు గద్దె దించాలో చెప్పాలని ప్రజలే కూటమి నాయకులను ప్రశ్నించాలని కవిత కోరారు. 24 గంటలు కరెంటు ఇస్తున్నందుకా... కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్లల పెళ్లిళ్లు ఖర్చు భరిస్తున్నందుకా... కెసిఆర్ కిట్టు ద్వారా పేదింటి కడుపు పండిన నాటి నుంచి ప్రసవం అయ్యేంత వరకు 12 వేల రూపాయలు ఇస్తున్నందుకా... రైతుబంధు ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నందుకా... హిందూ,ముస్లిం, క్రిస్టియన్లకు పండగలు పబ్బాలకు కొత్తబట్టలు పెడుతూ గౌరవంగా పండుగను జరుపుకునేందుకు సాయం చేస్తున్నందుకా... మౌలిక సదుపాయాల కల్పనకు పాటుపడుతున్నందుకా... ఎందుకు కేసీఆర్ ను గద్దె దించాలని అనుకుంటున్నారో ప్రజలే ప్రశ్నించాలని కవిత అన్నారు.   

 

click me!