హోళీ పాటల సీడీలను ఆవిష్కరించిన ఎంపీ కల్వకుంట్ల కవిత

Published : Mar 01, 2018, 07:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
హోళీ పాటల సీడీలను ఆవిష్కరించిన ఎంపీ కల్వకుంట్ల కవిత

సారాంశం

హోళీ పాటల సీడిని ఆవిష్కరించిన ఎంపి కవిత

హోళీ పాటల సీడీలను ఆవిష్కరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. హోళీ పండుగను పురస్కరించుకుని  తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం కన్వీనర్ కొదారి శ్రీను నిర్వహణలో తయారైన ఈ సీడీలను గురువారం ఎంపీ కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. తెలంగాణ జాగృతి సాంప్రదాయ తెలంగాణ హోళీ పాటల సీడీలను తయారు చేసింది. తెలంగాణ సాహిత్యాన్ని, వాంగ్మయాన్ని సహజ శైలిలో తెలంగాణ సమాజానికి అందించడంలో జాగృతి ఎల్లవేళలా శ్రమిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు.

జనం నోళ్ళలో నానుతున్న హోళీ పాటలను సహజ శైలిలో రికార్డు చేయించిన కోదారి శ్రీనును ఎంపీ కవిత అభినందించారు. సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి గల్ఫ్ అధ్యక్షులు చెల్లంశెట్టి హరిప్రసాద్,  సాంస్కృతిక విభాగం కన్వీనర్ కొదారి శ్రీను, యువజన విభాగం కన్వీనర్ కొరబోయిన విజయ్, తెలంగాణ జాగృతి మహారాష్ట్ర అధ్యక్షులు సుల్గె శ్రీనివాస్, జాగృతి రాష్ట్ర కార్యదర్శులు భిక్షపతి, కృష్ణారెడ్డి, నితీష్, నరేందర్ తదితరులు పాల్ఘొన్నారు. వీడియో కింద ఉంది చూడండి.

PREV
click me!

Recommended Stories

Medaram Sammakka Sarakka Jatara: మేడారం జాతరలో తెలంగాణ మంత్రులు | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే సమాచారం .. ఈ శుక్ర, శని, ఆది మూడ్రోజుల సెలవులు కన్ఫర్మ్