కాంగ్రెస్‌లో ఆ బుడ్డరఖాన్ చేరింది అందుకే : బాల్క సుమన్

Published : Oct 06, 2018, 06:14 PM IST
కాంగ్రెస్‌లో ఆ బుడ్డరఖాన్ చేరింది అందుకే : బాల్క సుమన్

సారాంశం

ఏపి సీఎం చంద్రబాబు పై బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఓ వ్యూమం ప్రకారం తెలంగాన పై దాడికి సిద్దమయ్యాడని ఆరోపించారు. అందులో భాగంగానే ముందుగా ఓ బుడ్డర ఖాన్ ను కాంగ్రెస్ లోకి పంపించారని అన్నారు. అతడి చేత తెలంగాణను నాశనం చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సుమన్ వ్యాఖ్యానించారు. వీరి ప్రయత్నాలు పలించకుండా  తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని సుమన్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఎలా మోసం చేసిందో సుమన్ వివరించారు. ఉద్యమంలో పాల్గొన్న విధ్యార్థులకు గత ఎన్నికల్లో సీట్లు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నారని అన్నారు. కానీ తెలంగాన రాష్ట్ర సమితి తమకు టికెట్లిచ్చి గెలిపించుకుందని తెలిపారు. 

ఏపిలో ఐటి దాడులు జరిగితే కేబినెట్ మీటింగ్ పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ వ్యవహారంతో ఏపిలో చంద్రబాబు పాలన ఎలా కొనసాగుతుందో తెలియజేస్తుందని సుమన్ విమర్శించారు. కానీ తెలంగాణలో కేసీఆర్ పాలన ప్రజారంజకంగా జరుగుతోందన్నారు. మహాకూటమికి వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రచారం సాగించాలని సుమన్ విధ్యర్థులకు పిలుపునిచ్చారు. 
 
PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ