మొన్న కారు ప్రమాదం .. నేడు మరో కష్టం : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా

By Siva KodatiFirst Published Mar 28, 2021, 9:40 PM IST
Highlights

తెలంగాణలో కరోనా నానాటికీ విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బారినపడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.

తెలంగాణలో కరోనా నానాటికీ విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బారినపడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.

కాగా, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఇటీవల విజయం సాధించిన సురభి వాణిదేవి.. వాహనం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

గురువారం ఉదయం వాణీదేవి శాసన మండలికి వస్తుండగా అసెంబ్లీ ప్రాంగణంలో అదుపుతప్పి గేటును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో వాణిదేవి గన్‌మెన్‌ కారు నడిపినట్టు తెలుస్తోంది. 

హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి పట్టభద్రుల స్థానాన్ని టీఆర్‌ఎస్‌ మొదటిసారి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 17న మొదలైన లెక్కింపు ప్రక్రియ మూడురోజులపాటు సుదీర్ఘంగా సాగింది.

చివరికి గత శనివారం సాయంత్రం వాణీదేవి విజయం ఖరారైంది. ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి వాణీదేవి ఆధిక్యత ప్రదర్శించారు. ఆమెకు 33.43 శాతం, రాంచందర్‌రావుకు 31.05, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు 15.90 శాతం ఓట్లు వచ్చాయి.

click me!