యాదాద్రిపై కరోనా ప్రతాపం: మరో 38 మంది సిబ్బదికి పాజిటివ్, భక్తుల్లో కలవరం

By Siva KodatiFirst Published Mar 28, 2021, 9:04 PM IST
Highlights

యాదగిరి గుట్టలో కరోనా కలకలం రేపుతోంది. నిన్న 30 మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలగా.. ఇవాళ మరో 38 మందికి నిర్థారణ అయ్యింది. వీరిలో 30 మంది టెంపుల్ ఉద్యోగులు, కాగా.. మిగతా 8 మందిలో ఇద్దరు జర్నలిస్టులు, ఉద్యోగుల కుటుంబసభ్యులు వున్నారు. 
 

యాదగిరి గుట్టలో కరోనా కలకలం రేపుతోంది. నిన్న 30 మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలగా.. ఇవాళ మరో 38 మందికి నిర్థారణ అయ్యింది. వీరిలో 30 మంది టెంపుల్ ఉద్యోగులు, కాగా..  మిగతా 8 మందిలో ఇద్దరు జర్నలిస్టులు, ఉద్యోగుల కుటుంబసభ్యులు వున్నారు. 

మొత్తం ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకులు, సిబ్బందిలో 86 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నిన్న 30 మందికి, ఆదివారం 38 మందికి పాజిటివ్‌గా తేలింది. యాదాద్రి ఆలయంలో ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ఈ క్రమంలో ఆలయ సిబ్బందిలో పలువురికి కరోనా సోకి ఉండవచ్చనే ఆలయ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆలయంలో సిబ్బందికి, అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. భక్తుల్లో కూడా ఆందోళన నెలకొంది.

దీంతో ఆదివారం నుంచి స్వామివారి అర్జిత సేవలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే భక్తులను దైవదర్శనాలకు అనుమతించనున్నట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు. 

కాగా, తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం 535 కొత్త కేసులు నమోదయ్యాయి.  ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 154 కేసులు నమోదయ్యాయి.

కరోనా బారిన పడి నిన్న ఒక్కరోజే ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,688కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,495 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

click me!