అసలు ఎంపీపీ ఎవరు? ఏమన్నా.. ఎర్రబెల్లి దయాకర్ రావా? లేకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్ అర్బన్ జిల్ల వేలేరు జెడ్సీటీసీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సోదరి చాడ సరిత వ్యవహార శైలిమీద పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో మొరం తరలింపు విషయం వివాదంగా మారింది. అప్పట్లో స్వాధీనం చేసుకున్న ఇటాచీ సహా ఇతర వాహనాలను తక్కువ జరిమానాతో వదిలేయాలని అక్కడి తహసీల్దార్ విజయలక్ష్మికి ఫోన్ లో హుకుం జారీ చేశారు సరిత. అయినా తహసీల్దార్ వినకపోవడంతో గట్టిగా బెదిరించారు.
ఇటీవల జడ్పీటీసీ, తహసీల్దార్ మధ్య సాగిన ఫోన్ సంభాషణ బుధవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను చెప్పినా.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పినా ఒక్కటిగా భావించాలని, ఎమ్మెల్సీ మాట వింటారా, ఎంపీపీ మాట వింటారా మొదట తేల్చుకోవాలని జెడ్పీటీసీ సరిత చెప్పారు.
‘రూ.25 వేలు కట్టించుకుని మిషన్ రిలీజ్ చేయండి. అక్కడే పెట్టుకుంటే తుప్పు పట్టి పోవాల్నా.. అవసరమైతే ఎమ్మార్వో ఆఫీసు ఎదుట కూర్చుంటా’ అని సరిత హెచ్చరించారు. అయితే.. తాము మొదటి నుంచీ రూ. 50వేలనుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తున్నామని, అయినా కలెక్టర్ చెప్పినట్లు చేస్తానని తహసీల్దార్ చెప్పడంతో జడ్పీటీసీ జోక్యం చేసుకుని ‘మనవాడే కదా అని తీసుకొస్తే, రూ. లక్ష కట్టమంటే ఎలా? రూ. 25 వేలు కట్టించుకుని రిలీజ్ చేయాలని హుకుం జారీ చేశారు.
అసలు ఎంపీపీ ఎవరు? ఏమన్నా.. ఎర్రబెల్లి దయాకర్ రావా? లేకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ప్రతీది అన్నయ్యకకు చెప్పి చేస్తా.. ఇది మా అన్నయ్య మాట. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట.. ఆయన మాట వింటారో.. ఎంపీపి మాట వింటారో మీరే డిసైడ్ చేసుకోండి.’ అని సరిత చెప్పారు. తర్వాత ఏం జరిగిందో కానీ వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మిని కలెక్టరేట్ కు బదిలీ చేయడం కొసమెరుపు.