రూ. 30 వేలు లంచం: ఏసీబీకి చిక్కిన జగిత్యాల ఎస్ఐ శివకృష్ణ

By narsimha lodeFirst Published Jun 17, 2021, 4:28 PM IST
Highlights

 రూ. 30 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు జగిత్యాల ఎస్ఐ శివకృష్ణ. 
 

జగిత్యాల: రూ. 30 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు జగిత్యాల ఎస్ఐ శివకృష్ణ. ముగించిన కేసులో మళ్లీ బాధితులను పిలిచి  రూ.50 వేలు డిమాండ్ చేశారని ఎస్ఐ శివ కృష్ణపై బాధితులు ఆరోపిస్తున్నారు. 

ఈ విషయమై ఎస్ఐ వేధింపులు భరించలేక బాధితులు ఏసీబీని ఆశ్రయించాడు రాజేష్.  ఏసీబీ అధికారుల సూచన మేరకు ఎస్ఐ శివకృష్ణ గురువారం నాడు  రూ. 30 వేలు లంచం తీసుకొంటుండగా  ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో హైద్రాబాద్ నగరంలో ఓ ఎస్ఐ ఓ భూ వివాదంలో పెద్ద ఎత్తున లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కారు.

ఈ వ్యవహరం అప్పట్లో పెద్ద ఎత్తున  సంచలనంగా మారింది.భూ వివాదంలో రెవిన్యూ అధికారులతో పాటు ఎస్ఐ కూడ అప్పట్లో ముండుపులు తీసుకొన్నారనే ఆరోపణలు కూడ వచ్చాయి. అయితే  ఆ తర్వాత ఫిర్యాదుదారుడే తప్పుడు పత్రాలతో భూ వివాదానికి తెర లేపారని తేల్చింది. పోలీసులు లంచం తీసుకొంటూ పట్టుబడడం తెలంగాణ రాష్ట్రంలో  గతంలో కూడ చోటు చేసుకొన్నాయి. 


 

click me!