గజ్వేల్ కాదు.. దమ్ముంటే హుజురాబాద్‌లో పోటీ చేసి గెలువు : ఈటల రాజేందర్‌కు కౌశిక్ రెడ్డి సవాల్

Siva Kodati |  
Published : Jul 26, 2022, 03:41 PM IST
గజ్వేల్ కాదు.. దమ్ముంటే హుజురాబాద్‌లో పోటీ చేసి గెలువు : ఈటల రాజేందర్‌కు కౌశిక్ రెడ్డి సవాల్

సారాంశం

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. కేసీఆర్ పై గెలుస్తాననే మాటలు పక్కన పెట్టి, హూజూరాబాద్‌లో పోటీ చేసి గెలవాలని కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ లో కనీసం లక్ష రూపాయల అభివృద్ధి అయినా జరిగిందా అని ఆయన ఈటలను ప్రశ్నించారు. 

తెలంగాణలో గత కొన్నిరోజులుగా టీఆర్ఎస్ (trs), బీజేపీ (bjp) నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌‌పై గజ్వేల్‌లో తాను పోటీ చేసి గెలుస్తానంటూ మాజీ మంత్రి , బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (etela rajender) వ్యాఖ్యలు చేయడంతో ఇక్కడి రాజకీయాలు హాట్ హాట్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి (padi kaushik reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (kcr) కాలి గోటికి కూడా ఈటల సరిపోడని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో ఈటలకు ఓటమి భయం పట్టుకుందని .. కేసీఆర్ పై గెలుస్తాననే మాటలు పక్కన పెట్టి, హూజూరాబాద్‌లో పోటీ చేసి గెలవాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. ఉప ఎన్నిక తర్వాత హుజూరాబాద్ లో కనీసం లక్ష రూపాయల అభివృద్ధి అయినా చేశారా? అని ఆయన నిలదీశారు. 

అటు బాల్క సుమ‌న్ (balka suman) సైతం ఈటల రాజేందర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజేందర్ మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారనీ, వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రి గా చేసింది కేసీఆర్ యే అని అన్నారు. ఈటెల విశ్వాస ఘాతకుడు, తిన్నింటి వాసాలను లెక్క బెట్టారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2004 కు ముందు ఈటెల అడ్రస్ ఎక్కడ? అని  ప్ర‌శ్నించారు. ఈటెల శిఖండి రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. 

Also Read:TRS MLA Balka Suman: "అతిగా మాట్లాడితే.. నాలుక చీరేస్తాం.." ఈటెలకు బాల్క సుమ‌న్ వార్నింగ్

ఆరోగ్య మంత్రిగా ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడని.. కమ్యూనిస్టు కమ్యునలిస్టుగా మారారని అన్నారు. హుజూరాబాద్ లో ఈటెల ఓటమి ఖాయమ‌నీ, అందుకే గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీలో ఈటెల బానిస‌లా బ‌తుకుతున్నాడ‌నీ, ఆయ‌న‌ ఓ చెల్లని రూపాయని బాల్క సుమ‌న్ విమ‌ర్శించారు. 

ప‌బ్లిసిటీ కోసమే ఈటెల తంటాలు ప‌డుతున్నాడ‌నీ, బీజేపీ లో ఈటెల ది బానిసలా బతుకుతున్నాడ‌నీ,  వరదల్లోనూ బీజేపీ కండువాలు కప్పుతూ బురద రాజకీయం చేశాడ‌నీ, తెలంగాణ రాజ‌కీయాల‌లో  ఈటెల  శిఖండి వంటి వాడ‌నీ, తెలంగాణ కంట్లో నలుసు లా మారారని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ లు తెలంగాణ ద్రోహుల తయారీ కర్మాగారాలు గా మారాయనీ, పదవులు రాజకీయాలు తప్ప బీజేపీ కాంగ్రెస్ లకు ఈ వరదల్లో ప్రజల ఘోష పట్టడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
 
బీసీ, ఎస్సిల భూములు కబ్జా చేసిన నీచ చరిత్ర ఈటెలదనీ, ఈటెల చిట్టాను బయటకు తెస్తాం..కబ్జా చేసిన భూములను పేదలకు పంచుతామని బాల్క‌సుమ‌న్ స్పష్టం చేశారు. ఈటెల ఎగిరెగిరి మాట్లాడుతున్నారనీ, నోరు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఈటెల దమ్ముంటే మళ్ళీ హుజురాబాద్ లోనే పోటీ చేసి గెలవాలని బ‌హిరంగంగా సవాల్‌ విసిరారు. ప్ర‌స్తుతం హుజురాబాద్ లో ఒడిపోతాననే తెలిసి ఈటెల కొత్త పల్లవి అందుకున్నారని, మొన్న ఈటెల కాంగ్రెస్, రేవంత్ ల సాయం తో గెలిచారనీ, ఈటెల ఎక్కువ మాట్లాడితే..  ఆయన నాలుక చీరేస్తామని హెచ్చరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu