తనపై తప్పుడు ప్రచారం చేస్తే రోడ్డుపై చెప్పుతో కొడతానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పారు.
హైదరాబాద్: తనపై ఇలానే తప్పుడు ప్రచారం చేస్తే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను నడిరోడ్డుపై చెప్పుతో కొడతానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో అరవింద్ ఎక్కడినుండి పోటీ చేసినా కూడా అక్కడికి వెళ్లి ఆయనను ఓడించేందుకు ప్రయత్నిస్తానని కవిత స్పష్టం చేశారు.
ఎంపీ అరవింద్ చిన్న మనస్సుతో అత్యంత హేమమైన భాషతో వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె చెప్పారు. చిల్లర మాటలతో నిజామాబాద్ పేరును చెడకొడుతున్నారని ఎంపీ అరవింద్ పై ఆమె మండిపడ్డారు. ఎంపీగా ఉండి 4 ఏళ్లలో 5 డెబిట్స్ పాల్గొని 56 ప్రశ్నలకు మాత్రమే ఆయన పరిమితం అయ్యారన్నారు. పార్లమెంట్ లో టీఆరెస్ ఎంపీలతో పోల్చితే నిజామాబాద్ ఎంపీ ఫెర్మామెన్స్ సగం కూడా లేదని కవిత తెలిపారు. ఎన్నికల సమయంలో పసుపు బోర్డు విషయంలో బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలను మోసం చేశారిన కవిత విమర్శించారు. ఈ విషయమై ప్రజలను ఎంపీ మోసగించారన్నారు. అరవింద్ ఏం చదువుకున్నారో కూడా అర్ధం కావడం లేదన్నారు. ఆయన చదువు విషయంలో అనుమానాలున్నాయన్నారు.ఈ విషయమై తానే స్వయంగా ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలిపారు. బురదలో రాయి వేస్తే మనపై బురద పడుతుందని భావించి ఇప్పటివరకు ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా చూసీ చూడకుండా ఉన్నామన్నారు. తాను మల్లికార్జున ఖర్గేతో మాట్లాడినట్టుగా ఎంపీ అరవింద్ తప్పుడు ఆరోపణలు చేశారని కవిత మండిపడ్డారు.
also readకవితపై వ్యాఖ్యలు: నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంట్లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిన టీఆర్ఎస్
తెలంగాణ వాసనలేని పార్టీలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. తన బతుకు, పుట్టుక తెలంగాణతోనేనని కవిత తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను వ్యక్తిగతంగా ఎవరిపై వ్యాఖ్యలు చేయలేదన్నారు. కానీ అరవింద్ చేసిన వ్యాఖ్యల కారణంగా తాను ఇవాళ ఇలా మాట్లాడినందుకు క్షమించాలని ఆమె తెలంగాణ ప్రజలను కోరారు. భవిష్యత్తులో అరవింద్ పై మాట్లాడబోనని కవిత తెలిపారు.
తనకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమేనని చెప్పారు. ఏక్ నాథ్ షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడం పై మాట్లాడారన్నారు. తెలంగాణ లో షిండే మోడల్ నడవదన్నారు. మోడీకి వ్యతిరేకంగా ఉన్న నేతలపై ఈడీ , సీబీఐ, ఐటీ వంటి సంస్థలు దాడులు చేస్తున్నాయన్నారు. . ఈడీ, ఐటీ, సీబీఐ తనకు అల్లుళ్లని లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే గత ఎన్నికల్లో అరవింద్ విజయం సాధించాడన్నారు. అందుకే ఆ పార్టీ నేతలతో ఆయనకు సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు.అరవింద్ కు కాంగ్రెస్ నేతలతో ఏం పని అని ఆమె ప్రశ్నించారు. బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ కు పనిచేస్తున్నారా ఆమె ప్రశ్నించారు.