కుటుంబ ఇలవేల్పు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత

By Arun Kumar PFirst Published Jun 8, 2021, 1:42 PM IST
Highlights

కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్ జిల్లాలోని కొండూరుకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. 

నిజామాబాద్: తమ కుటుంబ ఇలవేల్పు నందిపేట్ మండలం సిఎచ్ కొండూరు గ్రామంలో వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామిని సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్ జిల్లాలోని కొండూరుకు చేరుకున్న కవితకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు కవిత. ఈ పూజల్లో మ్మెల్యేలు జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు కూడా పాల్గొన్నారు. 

పూజా కార్యక్రమం ముగిసిన అనంతరం కవిత మాట్లాడుతూ... ఎంతో చరిత్ర కలిగిన ఈ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మరింత సుందరంగా నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆలయ పునర్నర్మాణం కోసం గ్రామస్తులు, ఆలయ పూజారులతో చర్చించినట్లు కవిత వెల్లడించారు. 

ఇక కొండూరు గ్రామ అభివృద్ధి కోసం కూడా ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా రూ.110 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులతో గ్రామానికి కావాల్సిన అన్ని మౌలిక సౌకర్యాలు  కల్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. 

click me!