లక్ష్మణ రేఖ దాటి మరీ టీఆర్ఎస్‌లోకి : కవిత వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 21, 2020, 8:31 PM IST
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆగడాలు సాగవన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి వరద సాయం కూడా కిషన్ రెడ్డి తీసుకురాలేదని ఎద్దేవా చేశారు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆగడాలు సాగవన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి వరద సాయం కూడా కిషన్ రెడ్డి తీసుకురాలేదని ఎద్దేవా చేశారు.

లక్ష్మణ్ రేఖ దాటి వచ్చి మరీ టీఆర్ఎస్‌లో చేరుతున్నారని... గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత అన్నారు.  గాంధీనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా పద్మానరేశ్‌తో కలిసి కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

గాంధీనగర్‌ డివిజన్‌లో అనేక  అభివృద్ధి పనులు చేశామని చెప్పారు.   గాంధీనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌   కార్యకర్తల సన్నాహక సమావేశంలో   ఎమ్మెల్సీ కవిత ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.  

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పార్టీనేతలకు సూచించారు. బీజేపీ అబద్దాలు చెప్పి గెలిచే కాలం చెల్లిందని ఆమె ధ్వజమెత్తారు. కరోనా వచ్చినప్పుడు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌  ముఠా పద్మ ప్రజల మధ్యలో ఉన్నారని.. కానీ బీజేపీ నేత లక్ష్మణ్ పత్తా లేరని కవిత మండిపడ్డారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉందని.. వరదలతో నష్టపోయిన వారిని సీఎం కేసీఆర్ ఆదుకున్నారని ఆమె గుర్తుచేశారు. బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని.. మోసపూరిత మాటలను ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని కవిత దుయ్యబట్టారు. 

click me!